https://oktelugu.com/

Balakrishna: బాలయ్య అప్పట్లో ఎంత కట్నం డిమాండ్ చేశారో తెలుసా ?

Balakrishna: తెలుగునాట ‘నందమూరి తారక రామారావు’ అంటే.. తెలుగు ప్రముఖుల చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ధృవతారలా నిలిచిపోయిన ఒక ప్రభంజనం. తెలుగు తెరను శ్వాసించి శాసించిన మహా నటుడు. అలాంటి మహానటుడితో వియ్యం అందుకోవాలని ఎవరికీ ఉండదు. పైగా అప్పటికే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కూడా. పైగా, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడిగా దేశ రాజకీయాలను మార్చిన మహా నేత కూడా. ఇటు సినిమాల్లోనూ అటు రాజకీయాల్లోనూ నెంబర్ 1 గా రాణించిన ఏకైక వ్యక్తి కూడా […]

Written By:
  • Shiva
  • , Updated On : May 14, 2022 / 02:56 PM IST
    Follow us on

    Balakrishna: తెలుగునాట ‘నందమూరి తారక రామారావు’ అంటే.. తెలుగు ప్రముఖుల చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ధృవతారలా నిలిచిపోయిన ఒక ప్రభంజనం. తెలుగు తెరను శ్వాసించి శాసించిన మహా నటుడు. అలాంటి మహానటుడితో వియ్యం అందుకోవాలని ఎవరికీ ఉండదు. పైగా అప్పటికే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కూడా. పైగా, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడిగా దేశ రాజకీయాలను మార్చిన మహా నేత కూడా.

    Sr NTR

    ఇటు సినిమాల్లోనూ అటు రాజకీయాల్లోనూ నెంబర్ 1 గా రాణించిన ఏకైక వ్యక్తి కూడా ఎన్టీఆరే. ఎన్టీఆర్ గారికి 11 మంది సంతానం అన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఎన్టీఆర్ సంతానంలో బాలకృష్ణకి ఆ రోజుల్లో విపరీతమైన క్రేజ్ ఉండేది. సినిమాల్లో ఎన్టీఆర్ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లగలిగే కొడుకుగా బాలయ్యకి గుర్తింపు వచ్చింది. బహుశా, అందుకే బాలయ్య పై ఎన్టీఆర్ గారు కూడా అమితమైన ప్రేమను చూపించే వారు.

    Also Read: NTR Acting: ఎన్టీఆర్ నటనకు ఫిదా అయిపోయిన క‌ళాత‌ప‌స్వి !

    బాలయ్యను చాలా గారాబంగా చూసుకునేవారు. కానీ.. బాలయ్య పెళ్లి విషయంలో మాత్రం ఎన్టీఆర్ పెద్దగా ఆసక్తి చూపించలేకపోయారు. అవి తెలుగుదేశం పార్టీ స్థాపించడానికి ఎన్టీఆర్ సన్నద్ధం అవుతున్న రోజులు. అప్పటికే, బసవతారకంగారు బాలయ్యకి పెళ్లి చేయాలని ఎన్టీఆర్ పై ఒత్తిడి చేస్తుండేవారు. కానీ, ఎన్టీఆర్ కి మాత్రం సంబంధాలు చూసే తీరిక లేదు.

    Balakrishna, Vasundra

    దాంతో ఎన్టీఆర్ గారు ఆ బాధ్యతని అప్పటి తన సహచరుడు నాదెండ్ల భాస్కరరావు కి అప్పగించారు. భాస్కర్ రావుకి దేవరపల్లి సూర్యారావు గుర్తుకు వచ్చారు. ఓ ఫంక్షన్ లో ఆయన కుటుంబాన్ని భాస్కరరావు చూశారు. ఆయన కూతురు బాలయ్యకి మంచి జోడి అనుకున్నారు. ఇంతకీ ఈ దేవరపల్లి సూర్యారావు ఎవరు అంటే.. శ్రీరామదాసు మోటార్ ట్రాన్స్ పోర్ట్ అధినేత. ఆయనను కలిసి విషయం చెప్పారు. ఎన్టీఆర్ గారితో వియ్యం అనేసరికి, దేవరపల్లి సూర్యారావు చాలా ఆనందించారు.

    Nadendla Bhaskara Rao

    వెంటనే కుటుంబాలు కలిశాయి. బాలయ్య – వసుంధర దేవి పెళ్లి చూపులు ముగిశాయి. మరి బాలయ్య ఎన్ని కోట్లు కట్నం తీసుకున్నారో తెలుసా ? బాలయ్యకి రూ.10 లక్షలు కట్నం ఇచ్చారు దేవరపల్లి సూర్యారావు. ఆ డబ్బుతో హైదరాబాద్ లో ఓ ఇల్లు కట్టించి ఇచ్చారని నాదెండ్ల భాస్కర రావు గారు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

    Also Read: KGF 3 Update: ‘కేజీఎఫ్ 3’ ప్రకటించిన నిర్మాత.. ఎప్పుడు రాబోతుందో తెలుసా ?

    Tags