Mahesh Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలు ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్లను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు సైతం సూపర్ సక్సెస్ లను అందుకుంటూ ముందుకు సాగుతున్నాడు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక అందులో భాగంగానే స్టార్ హీరోలుగా గుర్తింపును సంపాదించుకున్న మహేష్ బాబు కూడా తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధిస్తే మరికొన్ని సినిమాలు మాత్రం ఆశించిన మేరకు విజయాలను సాధించలేకపోయాయి. కారణం ఏదైనా కూడా ఆయన చేసే సినిమాల్లో ప్రేక్షకులకు నచ్చే ఎలిమెంట్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఇక దర్శకుడిని నమ్మి మహేష్ బాబు మూడు సార్లు అవకాశం ఇచ్చినప్పటికి ఆ దర్శకుడు మహేష్ బాబు కి ఒక్క సక్సెస్ ను కూడా ఇవ్వలేకపోయాడు. ఫలితంగా ఆయన చేసిన మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి… నిజానికి ఆదర్శకుడు ఎవరు అనేది ఒకసారి మనం తెలుసుకుందాం…
మాటల మాంత్రికుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబుని హీరోగా పెట్టి అతడు అనే సినిమా చేశాడు. ఈ సినిమా ధియేటర్లలో సరిగ్గా ఆడలేదు. ఇక టీవీలో ఈ సినిమాకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక ఆ తర్వాత వీళ్ళ కాంబినేషన్ లో ఖలేజా అనే సినిమా వచ్చింది. ఇక ఈ సినిమా డిజాస్టర్ అయింది. ఇక ఇప్పటికి చాలా మంది ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందో తెలియడం లేదు అంటూ సెలబ్రిటీలు సైతం ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఉంటారు.
నిజానికి ఈ సినిమా లో మహేష్ బాబు కామెడీ అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాతోనే మహేష్ బాబు కూడా కామెడీ చేయగలడు అని ప్రూవ్ చేసుకున్నాడు… ఇక ఈ రెండు సినిమాల తర్వాత కూడా ఆయన త్రివిక్రమ్ కి మరొక అవకాశం అయితే ఇచ్చాడు. ‘గుంటూరు కారం’ సినిమా పేరుతో ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుడిని ఏమాత్రం ఎంగేజ్ చేయలేక పోయింది.
రోటీన్ రొట్ట ఫార్ములా లో సినిమా ఉండటమే దానికి కారణం అంటూ చాలామంది విమర్శకులు సైతం త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద విమర్శలైతే చేశారు. ఇక దాంతో ముచ్చటగా మూడోసారి కూడా మహేష్ బాబుకు సక్సెస్ ని ఇవ్వలేకపోయాడు.
ఇక మిగతా హీరోలందరికి సక్సెస్ లను ఇస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు దగ్గరికి వచ్చేసరికి ఎందుకు డీలా పడిపోతున్నాడు అంటూ చాలామంది వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఇక్కడ సక్సెస్ అనేది చాలా కీలకం కాబట్టి సక్సెస్ సాదించిన వాళ్ళకే మంచి గుర్తింపైతే లభిస్తుంది…