Annapurnamma Remuneration: జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీల ద్వారా ఈటీవీ నవ్వుల పూవులు పూయిస్తోంది. ఈ రెండు షోలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ఇష్టమైన కార్యక్రమాలుగా నిలుస్తున్నాయి. ఇందులో పండించే కామెడీ కోసమే వారు అంతగా దగ్గరవుతున్నారు. ఇక జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలకు వస్తున్న స్పందన మామూలుగా లేదు. హాస్యమే ప్రధానంగా సాగే షోలు కావడంతో ప్రేక్షకులు బాగా ఆకర్షితులవుతున్నారు. ఇందులో ఉండే కంటెస్టెంట్లు కూడా అదే రేంజ్ లో పంచులు వేస్తూ షోకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.

ఇక సీనియర్ నటి అన్నపూర్ణమ్మ కూడా ఇందులో ప్రధాన భూమిక పోషిస్తున్నారు. సినిమాల్లో కూడా తనదైన శైలిలో నటించి అందరిని మెప్పించిన అన్నపూర్ణమ్మ, జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీల్లో ఆటో రాంప్రసాద్ స్కిట్లలో కనిపిస్తోంది. దీంతో షోలు ఎక్కడికో వెళ్లిపోతున్నాయి. ఆమె రాకతో సందడి పెరుగుతోంది. ప్రేక్షకుల్లో కూడా స్పందన బాగా వస్తోంది. దీంతో ఆమెను అలాగే కంటిన్యూ చేస్తూ షోలు చేయడం తెలిసిందే. దీంతో మల్లెమాల యాజమాన్యం ఆమెను తీసుకొచ్చి తన రేటింగ్ పెంచుకుంటోందని తెలుస్తోంది.
గతంలో కూడా మొదట ఎంట్రీ ఇచ్చినప్పుడు అన్నపూర్ణమ్మ జబర్దస్త్ లో నాగబాబు, రోజా పడిపడి నవ్వుతుంటే మమ్మల్ని ఎందుకు పిలవడం లేదని పలుమార్లు అనుకునేదాన్ని అని చెప్పింది. ఇప్పుడు ఆ కోరిక తీరిందని గుర్తు చేసుకుంది. అలా శ్రీదేవి డ్రామా కంపెనీలో జరిగే స్కిట్లలో అన్నపూర్ణమ్మ తనదైన మేనరిజంతో పంచులు వేస్తూ అందరిని ఆకట్టుకుంటోంది. దీంతో షోలకు మంచి స్పందన వస్తోంది. దీన్ని ఈటీవీ సద్వినియోగం చేసుకుంటోంది. ఆమె సేవలను వినియోగించుకుంటోంది.

శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ షో ఏదైనా పారితోషికం మాత్రం భారీగానే అప్పజెబుతున్నారు. అన్నపూర్ణమ్మ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాకే అవుతారు. అంతలా భారీ పారితోషికం ఆమె తీసుకుంటోంది. ఒక్కో కాల్షీటుకు ఆమె రెండున్నర లక్షల వరకు తీసుకుంటుందని టాక్. దీంతో ఎంతోమంది సీనియర్ కంటెస్టెంట్ల కంటే ఆమె పారితోషికం ఎక్కువే. ఎందుకంటే ఆమె రాకతో షోలకు భలే డిమాండ్ వచ్చిందని నమ్ముతున్నారు. పారితోషికానికి వయసుతో సంబంధం లేదు. ఎవరి టాలెంట్ వారిదే. అందుకే అన్నపూర్ణమ్మకు అంతటి రెమ్యునరేషన్ అందజేస్తున్నట్లు తెలుస్తోంది. అన్నపూర్ణమ్మ ఈ వయసులో కూడా ఇంతలా సంపాదిస్తుంటే అందరు తెగ ఇదైపోతున్నారట.
Also Read:Lavanya Tripathi: అవకాశాలు కరువు బరువెక్కుతున్న అందాల రాక్షసి లావణ్య
[…] Also Read: Annapurnamma Remuneration: జబర్దస్త్, శ్రీదేవి డ్రామా … […]
[…] Also Read: Annapurnamma Remuneration: జబర్దస్త్, శ్రీదేవి డ్రామా … […]
[…] Also Read: Annapurnamma Remuneration: జబర్దస్త్, శ్రీదేవి డ్రామా … […]