https://oktelugu.com/

Anchor Pradeep Remuneration: రోజుకు లక్షల్లో నెలకు కోట్లలో… యాంకర్ ప్రదీప్ రెమ్యూనరేషన్ తెలుసా?

హోస్ట్ గా ప్రదీప్ లేని షో పెద్దగా లేదని చెప్పాలి. ఇలా బుల్లితెర మీద హవా చూపిస్తున్న ప్రదీప్ రెమ్యూనరేషన్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

Written By: , Updated On : August 1, 2023 / 10:34 AM IST
Anchor Pradeep Remuneration

Anchor Pradeep Remuneration

Follow us on

Anchor Pradeep Remuneration: ప్రదీప్ మాచిరాజు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. బుల్లితెర మీద అతడు కనిపించని ఎంటర్టైన్మెంట్ ఛానల్ లేదంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం బుల్లితెర మీద మేల్ యాంకర్స్ లో ప్రదీప్ ని మించిన వాళ్లు లేరు. షో ఏదైనా సరే యాంకర్ గా కావచ్చు, హోస్ట్ గా ప్రదీప్ లేని షో పెద్దగా లేదని చెప్పాలి. ఇలా బుల్లితెర మీద హవా చూపిస్తున్న ప్రదీప్ రెమ్యూనరేషన్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

మనకి వినిపిస్తున్న సమాచారం ప్రకారం ప్రదీప్ రోజు వారి రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒక్క రోజుకు రూ. 3 నుంచి 5 లక్షలు వరకు ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా చూసుకుంటే నెలకు దాదాపు 2 కోట్ల వరకు సంపాదిస్తున్నాడు. మరోపక్క అప్పుడప్పుడు సినిమాలు, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్, కొన్ని బ్రాండ్స్ కు ప్రచారకర్తగా వ్యవహరిస్తూ బాగానే ఆర్జిస్తున్నారు ఈ బుల్లితెర ప్రముఖుడు.

అదే విధంగా ఇప్పటికే కొన్ని వేల కోట్లు ఆస్తులు వెనకేసినట్లు తెలుస్తోంది. ప్రదీప్ ఎక్కువగా స్థిర ఆస్తులు కొనుగోలు మీద దృష్టి పెట్టారు ఈ 37 ఏళ్ల బ్రహ్మచారి. మరోపక్క ప్రదీప్ ఏ షో చేసిన కానీ ఆయన పెళ్లి గురించి కచ్చితంగా ఏదో ఒక టాపిక్ వస్తూనే ఉంటుంది. గతంలో ప్రదీప్ హౌస్ట్ గా “పెళ్లిచూపులు” అనే షో నడిచింది. అందులో ఒక అమ్మాయిని చూసి ప్రదీప్ పెళ్లి చేసుకుంటాడు అనే మాటలు వినిపించిన కానీ చివరికి అలాంటిదేమి జరగలేదు.

అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది మొదట్లో ప్రదీప్ పెళ్లి ముచ్చట వినిపించే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే వాటికి సంబంధించిన పనులు మొదలైనట్లు తెలుస్తుంది. సినీ పరిశ్రమలో మంచి పరిచయాలు ఉన్న కానీ సినియేతర రంగానికి సంబంధించిన అమ్మాయిని చేసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి కొద్ది రోజుల్లో పెళ్లి టాపిక్ కి ప్రదీప్ పుల్ స్టాప్ పెడతాడేమో చూడాలి.