Celebrities Surname Names: సినిమా ఇండస్ట్రీలో ఆసక్తికర విషయాలు చోటు చేసుకుంటాయి. సినిమాల్లోకి రాకముందు కొందరి పేర్లు వేరే ఉంటాయి. కానీ ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత వారికి నిక్ నేమ్ లు యాడ్ అవుతాయి. ఇలా వచ్చిన నిక్ నేమ్స్ పాపులర్ అవుతూ ఉంటాయి. చిరంజీవి, మోహన్ బాబుల పేర్లు వేరే. కానీ సినిమాల్లోకి వచ్చాక వారి పేర్లు మారిపోయాయి. అయితే చాలా మంది తమ మొదటి సినిమా హిట్టు కావడంతో దానినే ఇంటిపేరుగా మార్చుకున్నవాళ్లు చాలా మంది ఉన్నారు. ఇండస్ట్రీలో వాళ్లని అలా పిలవడంతో అదే కొనసాగుతోంది. తెలుగు సినిమాల్లో 10 మంది సెలబ్రెటీలో తమ ఫస్ట్ మూవీ హిట్టు కావడంతో దానిని ఇంటిపేరుగా మార్చుకున్నారు. వారి గురించి వివరాల్లోకి వెళితే..
‘వెన్నెల’ కిశోర్:
బ్రహ్మానందం, ఆలీ, సుధాకర్ ల తరువాత అంతటి గుర్తింపు తెచ్చుకుంటున్న కమెడియన్లలో వెన్నెల కిశోర్ ఒకరు. ఈయన మొదటిసారిగా నటించిన ‘వెన్నెల’ సినిమా హిట్టు కావడంతో దానినే ఇంటిపేరుగా మార్చుకున్నాడు.
‘దిల్’ రాజు:
ప్రముఖ నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. నితిన్ హీరోగా వచ్చిన ‘దిల్’ సినిమా హిట్టయిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు నిర్మాత రాజు కావడంతో ఆయన ఇంటిపేరు దిల్ గా మారింది.
‘సత్యం’ రాజేశ్:
సుమంత్ హీరోగా వచ్చిన ‘సత్యం’ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇందులో రాజేశ్ అనే వ్యక్తి పులి రాజాగా ఫేమస్ అయ్యాడు. అప్పటి నుంచి ఆయన ఇంటిపేరు సత్యం రాజేశ్ గా మారింది.
సిరివెన్నెల సీతారామశాస్త్రి:
మహాకావ్యం సిరివెన్నెల సినిమా ఎంత ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు పాటలు రాసిన సీతారామశాస్త్రి గారి ఇంటిపేరు సిరివెన్నెల సీతారామశాస్త్రిగా మారిపోయింది.
‘అల్లరి’ నరేష్:
మొన్నటి వరకు కామెడి హీరోగా కొనసాగుతూ.. ఇప్పుడు మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నరేష్ ఫస్ట్ మూవీ ‘అల్లరి’. ఈ సినిమా సక్సెస్ కావడంతోనే ఆయన ఇంటిపేరు ‘అల్లరి’గా మారిపోయింది. ప్రస్తుతం ఆయనను ‘అల్లరి’ నరేష్ గా పిలుస్తారు.
‘అల్లరి’ సుభాషిణి:
అల్లరి సినిమాలో సుభాషిణి అనే మహిళ ఫేమస్ అయింది. దీంతో ఆమెను ‘అల్లరి’ సుభాషిణి గా పిలుస్తున్నారు.
‘బొమ్మరిల్లు’ భాస్కర్:
ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా వచ్చిన ‘బొమ్మరిల్లు’ ఎంత ఫేమస్ అయిందో తెలిసిన విషయమే. ఈ సినిమాకు డైరెక్టర్ గా చేసిన భాస్కర్ కు బొమ్మరిల్లు భాస్కర్ గా పేరొచ్చింది.
‘రంగస్థలం’ మహేష్:
రామ్ చరణ్ హీరోగా వచ్చిన ‘రంగస్థలం’ సినిమాలో హీరో స్నేహితుడిగా ఉన్న మహేష్ మొదటి సినిమా ఇది. ఈ సినిమ హిట్టుకావడంతో అతడిని రంగస్థలం మహేష్ గా పిలుస్తున్నారు.
‘ఛత్రిపతి’ శేఖర్:
శేఖర్ ఎప్పటి నుంచో సినిమాల్లో కొనసాగుతున్నారు. అయితే ఛత్రపతిలో ఆయన యాక్టింగ్ ఫేమస్ కావడంతో అతనికి ఛత్రపతి శేఖర్ అనే పేరు వచ్చింది.
‘బహుబలి’ ప్రభాకర్:
ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా వరల్డ్ లెవల్లో హిట్టు కొట్టింది. ఇందులో కాలికేయ పాత్రలో నటించి ప్రభాకర్ కు ‘బాహుబలి’ ప్రభాకర్ గా పేరు వచ్చింది.