Heroes Remuneration: సినిమా అనేది ప్రస్తుతం అందరికి ఒక బిజినెస్ అయిపోయింది. ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ కోరుకుంటే చాలామంది ప్రొడ్యూసర్లు సినిమాతో పెద్ద ఎత్తున బిజినెస్ చేసి కోట్లలో లాభాలను సంపాదిస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే తెలుగులో టాప్ ప్రొడక్షన్ హౌజ్ గా గుర్తింపును తెచ్చుకున్న వాళ్ళలో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు సైతం వరుస సినిమాలను చేస్తున్నారు. ఇప్పుడు వరుస సినిమాలను చేస్తూ సూపర్ సక్సెస్ లను సాధిస్తున్న విషయం మనకు తెలిసిందే… ఇక రీసెంట్ గా మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ అయిన రవిశంకర్ సైతం రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రామ్ చరణ్ గురించి చాలా గొప్పగా మాట్లాడాడు. రంగస్థలం సినిమా సమయంలో అతనికి ఒప్పుకున్న రెమ్యునరేషన్ ని విడతలవారీగా ఇచ్చామని ఆయన కూడా రెమ్యునరేషన్ కావాలని అడగలేదని ఒకసారి 30 లక్షలు, ఒకసారి 20 లక్షలు చొప్పున రెమ్యునరేషన్ ఇచ్చాము అంటూ ఆయన చెప్పడం విశేషం…
ఒకరకంగా రామ్ చరణ్ సినిమా కోసం తన రెమ్యునరేషన్ తగ్గించుకొని మరి తీసుకున్న సందర్భాలు ఉన్నాయని చాలా మంది చెబుతుంటారు. ఇక రవిశంకర్ చెప్పిన దాని ప్రకారం రామ్ చరణ్ మీద ఒక క్లారిటీ వచ్చింది. రంగస్థలం సినిమా అయిపోయిన తర్వాత కూడా రెమ్యునరేషన్ ఇస్తానంటే పర్లేదులే అని చెప్పి తర్వాత తీసుకుంటానని చెప్పారట. కారణమేంటి అంటే వాళ్ల మీద నమ్మకమైన ఉండొచ్చు, లేదంటే సినిమా సక్సెస్ అయిందనే సంతోషమైన అయి ఉండొచ్చు.
ఏది ఏమైనా కూడా ప్రొడ్యూసర్ బాగుండాలి అంటే హీరోలు ఎలాంటి వైఖరితో ఉండడం చాలా మంచిదని చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు… ఇక వీళ్లే కాకుండా పవన్ కళ్యాణ్ లాంటి హీరో గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు.
ఆయన సినిమా ఫ్లాప్ అయిన సందర్భంగా చాలా సార్లు ప్రొడ్యూసర్స్ కి తన రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మహేష్ బాబు లాంటి నటుడు కూడా చాలా సందర్భాల్లో తన రెమ్యునరేషన్ ను భారీ తగ్గించుకొని తీసుకున్నాడు…మిగతా హీరోలు కూడా వాళ్ల సినిమా ఔట్ పుట్ కోసం కొన్ని సందర్భాల్లో రెమ్యునరేషన్ ను వెనక్కి ఇచ్చేయడం మనం చూస్తూనే ఉన్నాం…