Divya Bharti Life: కొంతమంది హీరోయిన్లు ఒకటి, రెండు సినిమాలతోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకొని అతి తక్కువ సమయంలో స్టార్లుగా ఎదిగారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరోయిన్ ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీని ఏలింది అని చెప్పొచ్చు. చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈమె కెరియర్ ప్రారంభంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. నిత్యం సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీనటుల వార్తలు సామాజిక మాధ్యమాలలో వినిపిస్తూనే ఉంటాయి. ఇక హీరోయిన్ల కు సంబంధించిన అఫైర్ల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక హీరోయిన్ ఇద్దరు ముగ్గురితో ఎఫైర్స్ పెట్టుకుంది అంటూ ఎన్నో వార్తలు సామాజిక మాధ్యమాలలో షికారు చేస్తుంటాయి. నటీనటుల ప్రేమ, పెళ్లి, విడాకులు ఇలా ఏ విషయం అయిన కూడా చర్చనీయాంశంగా మారుతుంది. సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు ప్రేమించిన వ్యక్తి కోసం మతం కూడా మారారు. పెళ్లి చేసుకున్న తర్వాత వేరే మతంలోకి మారిన హీరోయిన్లు కూడా మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే హీరోయిన్ కూడా చిన్న వయసులోనే ప్రేమించి పెళ్లి చేసుకుంది. తను ప్రేమించిన వ్యక్తి కోసం ఆమె మతం కూడా మారింది. ఈమె మరెవరో కాదు ఒకప్పటి కుర్రాల్ల కలల రాణి దివ్యభారతి.
సౌత్ సినిమా ఇండస్ట్రీలో కేవలం 17 ఏళ్ల అతి తక్కువ వయసులో ఈమె టాప్ హీరోయిన్ గా రాణించింది. 17 ఏళ్ళ చిన్న వయసులోనే స్టార్ హీరోలకు జోడిగా నటించిన 19 ఏళ్ల చిన్న వయసులోనే కన్ను మూసింది. ముంబైలో తాను నివాసం ఉంటున్న ఐదవ అంతస్తులో ఉన్న ఫ్లాట్ బాల్కనీ నుంచి కిందపడి దివ్యభారతి కన్ను మూసింది. ఈమె మరణం పై అప్పట్లో అనేక అనుమానాలు కూడా వినిపించాయి. ఈమెను ఎవరో కావాలని పై నుంచి కిందకు పడేసారని కూడా వార్తలు వినిపించాయి. దివ్యభారతి తెలుగుతోపాటు తమిళ్, హిందీలో కూడా పలు సినిమాలలో నటించి సూపర్ హిట్స్ అందుకుంది. ఈమె సజిద్ నదియాద్వల నో ప్రేమించింది. అయితే వీరిద్దరూ సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు అనే వార్తలు కూడా అప్పట్లో వినిపించేవి.
సజిద్ తో దివ్యభారతి పరిచయం సోలా ఔర్ శబ్నం సినిమా షూటింగ్ సమయంలో ఏర్పడిందని ఆ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకున్నారని వార్తలు వినిపించాయి. దివ్యభారతి తల్లి మీద సజిద్ ముస్లిం అయిన కూడా వీరి పెళ్లికి అంగీకరించి కానీ ఆమె తండ్రి మాత్రం ఒప్పుకోలేదు. ఆ తర్వాత దివ్యభారతి ముస్లిం మతంలోకి మారింది అని కూడా వార్తలు వినిపించాయి. దివ్యభారత్ నుంచి తన పేరును సనా నదియాద్వాలా గా మార్చుకుంది అని తెలుస్తుంది. తన సినిమా కెరియర్ పై దాని ప్రభావం పడకుండా సీక్రెట్ గా పెట్టినట్లు సమాచారం. 19 ఏళ్ల చిన్న వయసులో ఆమె అకాల మరణం మొత్తం సినిమా ఇండస్ట్రీని షాక్ అయ్యేలా చేసింది.