Divvela Madhuri Remuneration Bigg Boss 9 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్(Bigg Boss 9 Telugu) లోకి వైల్డ్ కార్డు గా ఎంట్రీ ఇచ్చిన వారిలో ఆడియన్స్ లో బలమైన ముద్ర వేసుకున్న కంటెస్టెంట్ దివ్వెల మాధురి. ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టకముందే ఒక పాపులర్ రాజకీయ నాయకురాలి ప్రేయసి గా మంచి ఫేమ్ ని సంపాదించింది. ఈమె హౌస్ లోకి రాబోతుంది అనే వార్త రాగానే ప్రతీ ఒక్కరు ‘ఆమ్మో..ఈమె ఎందుకు?’ అని అనేవాళ్ళు. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి రోజే గొడవలు పెట్టుకుంది. ఆ వారం మొత్తం కంటెస్టెంట్స్ తో గొడవలే గొడవలే. ఆ తర్వాత వీకెండ్ లో నాగార్జున కోటింగ్ ఇవ్వడం తో కాస్త తనని తాను మార్చుకునే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ కూడా ఆమె తన ఒరిజినాలిటీ ని కప్పేయలేకపోయింది. సందర్భం వచ్చినప్పుడల్లా గొడవలతో రెచ్చిపోయేది. ఈ యాటిట్యూడ్ జనాలకు నచ్చలేదు.
ముఖ్యంగా గత వారం నామినేషన్స్ లో రీతూ చౌదరి, డిమోన్ పవన్ లపై ఆమె చేసిన వ్యాఖ్యలు దారుణంగా అనిపించాయి. ఫలితంగా నామినేషన్స్ లోకి వచ్చిన మాధురి కి ఓట్లు పడలేదు. నేటి ఎపిసోడ్ లో ఆమె ఎలిమినేట్ కాబోతోంది. ఎలిమినేషన్ రౌండ్ మాధురి, గౌరవ్ మధ్య జరగ్గా, గౌరవ్ సేవ్ అయ్యి,మాధురి ఎలిమినేట్ అయ్యింది. అయితే ఈమె తనూజ కి అత్యంత క్లోజ్ కదా, ఆమె దగ్గర సేవింగ్ పవర్ ఉంది,దాంతో ఈమెని సేవ్ చేస్తుంది అని అంతా అనుకున్నారు. కానీ మాధురి నాకోసం సేవింగ్ పవర్ ఉపయోగించొద్దు, ఆడియన్స్ ఎలాంటి తీర్పు ఇస్తారో, దానినే నేను తీసుకుంటాను అని చెప్పిందట. ఒకవేళ ఆమె సేవింగ్ పవర్ ని తనూజ తో వాదించుకొని ఉండుంటే, ఆడియన్స్ చేత సేవ్ చేయబడిన గౌరవ్ ఎలిమినేట్ అయ్యేవాడు. బిగ్ బాస్ హౌస్ లో మరో అన్యాయమైన ఎలిమినేషన్ జరిగేది. ఆ అన్యాయం జరగకుండా ఆపింది మాధురి.
హౌస్ లోకి ఈమె నెగటివ్ ఇమేజ్ తోనే అడుగుపెట్టింది, కానీ వెళ్ళేటప్పుడు మాత్రం మంచి పాజిటివ్ ఇమేజ్ తో బయటకు వెళ్ళింది. ఆమె లక్ష్యం కూడా ఇదే అని పలు ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ హౌస్ లోకి నేను డబ్బులు కోసం, టైటిల్ కోసం వెళ్లడం లేదు, నన్ను తప్పుగా అర్థం చేసుకునే ఆడియన్స్ మైండ్ సెట్ ని మార్చడానికి వెళ్తున్నాను అని చెప్పి హౌస్ లోకి వచ్చింది. అనుకున్నది సాధించి లేడీ టైగర్ లాగానే బయటకు వెళ్ళింది. అయితే హౌస్ లో ఈమె మూడు వారాలు ఉన్నందుకు గాను, 7 లక్షల 50 వేల రూపాయిలు రెమ్యూనరేషన్ గా అందుకున్నట్టు తెలుస్తుంది. ఈ రెమ్యూనరేషన్ గురించి మాధురి భర్త దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ, డబ్బులు కోసం మాధురి ఈ షోకి వెళ్లలేదని, అసలు డబ్బులు అవసరమే లేదని, కాకపోతే వాళ్ళు డబ్బులు ఇస్తారట, ఇస్తే మేము అనాధాశ్రమాలకు దానం చేస్తాం అంటూ చెప్పుకొచ్చాడు.