swathi vikas divorce (1)
Telugu Heroine: ఇటీవల కాలంలో రోజురోజుకు విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ క్రమంలో సెలబ్రిటీలు ఎక్కువగా విడాకులు తీసుకుంటున్నారు. ఇటీవల సినిమా రంగానికి, క్రీడారంగానికి చెందిన సెలబ్రిటీలు విడాకులు తీసుకొని విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలోకి ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కూడా చేరిందని ప్రస్తుతం వార్తలు వినిపిస్తున్నాయి. విడాకులు తీసుకునే వారి సంఖ్య ఈరోజుల్లో క్రమంగా పెరిగిపోతుంది. అయితే ఈ విషయాన్ని కొంతమంది అధికారికంగా చెప్తుంటే మరి కొంతమంది మాత్రం విడాకుల విషయాన్ని అధికారికంగా చెప్పకుండా హింట్స్ రూపంలో ఇండైరెక్టుగా చెప్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో తమ భర్తతో దిగిన ఫోటోలను, వీడియోలను తొలగించేస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని రోజుల తర్వాత విడాకుల ప్రకటనతో అందరికీ షాక్ ఇస్తున్నారు. ఇప్పుడు ఇదే జాబితాలోకి టాలీవుడ్ లో ప్రముఖ హీరోయిన్ కూడా చేరిందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె మరెవరో కాదు బుల్లితెర మీద యాంకర్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కలర్స్ స్వాతి. యాంకర్ గా తన కెరీర్ను స్టార్ట్ చేసిన స్వాతి బుల్లితెరపి మీద ప్రసారమయ్యే కలర్స్ ప్రోగ్రాం కు యాంకర్ గా వ్యవహరించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అప్పటి నుంచి ఆమెకు కలర్స్ స్వాతి అనే పేరు వచ్చింది. ఆ తర్వాత ఈమె సినిమా ఇండస్ట్రీలో నటిగా, సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన డేంజర్ అనే సినిమాతో స్వాతి సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత వెంకటేష్, త్రిష జంటగా నటించిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అని సినిమాలో హీరోయిన్ త్రిష కు చెల్లెలి పాత్రలో అద్భుతమైన నటన కనపరిచింది. అష్ట చమ్మ అనే సినిమాతో హీరోయిన్ గా సక్సెస్ అయ్యింది స్వాతి.
ఆ తర్వాత తెలుగులో స్వామి రారా, కార్తికేయ, గోల్కొండ హై స్కూల్, త్రిపుర, లండన్ బాబులు వంటి సూపర్ హిట్ సినిమాలలో హీరోయిన్ గా నటించి మెప్పించింది. మిరపకాయ్, కందిరీగ, బంగారు కోడిపెట్ట వంటి పలు సినిమాలలో క్యామియో రోల్స్ లో కూడా అలరించింది స్వాతి. ఇక చివరిగా స్వాతి 2023లో రిలీజ్ అయిన మంత్ ఆఫ్ మధు అనే సినిమాలో నటించింది. ఈమె తన సినిమా కెరియర్ పిక్స్ లో ఉన్న సమయంలోనే కేరళకు చెందిన పైలట్ వికాస్ వాసును వివాహం చేసుకుంది. వీరి వివాహం 2018లో సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య చాలా ఘనంగా జరిగింది. అయితే వీరి పెళ్లయిన కొన్నేళ్లకే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చినట్లు సోషల్ మీడియా మాధ్యమాలలో కొన్ని వార్తలు వచ్చాయి.
swathi vikas divorce
ఆ తర్వాత స్వాతి మంత్ ఆఫ్ మధు సినిమా ప్రమోషన్స్లో తన భర్త గురించి అడిగితే సమాధానం చెప్పడంటూ తేల్చి చెప్పింది. ఇప్పుడు మరోసారి స్వాతి విడాకుల గురించి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో పెళ్లి ఫోటోలతో పాటు తన భర్తకు సంబంధించిన ఫోటోలు అన్నిటిని డిలీట్ చేయడమే. దీంతో చాలామంది స్వాతి ఇండైరెక్టుగా విడాకులపై హింట్ ఇచ్చేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే స్వాతి లేదా ఆమె భర్త స్పందించాలి.