Akkineni Family: అక్కినేని హీరోలకు పెళ్లి కలిసి రాలేదు అని నెటిజన్లు రకరకాల నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి నాగ చైతన్య – సమంతల వివాహం మూన్నాళ్ళ ముచ్చటగా మిగిలిపోవడం, ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీని ఇబ్బంది పెడుతుంది. నిజానికి చైతు – సామ్ దాదాపు నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్నారు. పెళ్ళికి ముందు ఇద్దరికీ ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు. అయినా ఎందుకో పెళ్లి తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి.

కనీసం అయిదు సంవత్సరాల పాటు భార్యాభర్తలుగా ఉండలేక విడిపోయారు. కారణాలు చాలా ఉన్నాయనేది ఫిల్మ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న టాక్. ముఖ్యంగా సామ్ బోల్డ్ పాత్రలు చేయడం, పెళ్లి తర్వాత ఆమె డ్రెస్సింగ్ స్టైల్ కొంచెం పరిధి దాటడం మొత్తానికి చైతు వైపు పెద్దలకు నచ్చలేదు. వారి కామెంట్స్ విన్న తర్వాత చైతు కూడా కాస్త ఫీల్ అయ్యాడు.
ఈ మధ్యలో ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. పెళ్లి పెటాకులు అయ్యాయి. అయితే, అక్కినేని ఫ్యామిలీలో విడాకులు చాలా కామన్ అని, స్వయంగా అక్కినేని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా కామెంట్స్ చేస్తుండటం విశేషం. ఈ విడాకుల వ్యవహారంలోకి తొంగి చూస్తే.. నాగార్జున, హీరో వెంకటేష్ సోదరిని మొదట పెళ్లి చేసుకున్నారు.
కానీ చైతు పుట్టిన తర్వాత కొన్ని కారణాల వల్ల నాగ్ విడాకులు ఇచ్చాడు. ఇక మరో అక్కినేని హీరో సుమంత్ విషయానికి వస్తే.. హీరోయిన్ కీర్తి రెడ్డిని పెళ్లి చేసుకున్న సుమంత్ ఆమెతో రెండేళ్లు కూడా కలిసి లేడు. సుమంత్ సిస్టర్ పరిస్థితి అదే. ఇక ఆ తర్వాత అఖిల్ అక్కినేని, శ్రియ భూపాల్ తో పెళ్లికి రెడీ అయ్యాడు. ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు.
కానీ ఏమైందో ఏమో.. అఖిల్ పెళ్లి మధ్యలోనే ఆగిపోయింది. ఇక ఇప్పుడు తాజాగా చైతు కూడా విడాకుల బాట పట్టాడు. మొత్తానికి అక్కినేని హీరోలకు పెళ్లిలు నిజంగానే కలిసి రాలేదు అనుకోవాలి.