Divorce : సమంత నాగచైతన్య విడిపోయే సమయంలో మీడియాలో జరిగిన రచ్చ గురించి తెలిసిందే. ఇప్పుడు మరో పెద్దింటి కుటుంబంలోని ఓ జంట విడిపోతుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆ కుటుంబంలో ఏడు ఎనిమిది మంది హీరోలు ఉంటారు. అయినా విడిపోతున్న జంటను ఆపలేకపోతున్నారట. నిజమే సెలెబ్రిటీలకు కొంచెం ఇబ్బంది అనిపించినా ‘లెట్స్ బ్రేకప్ ‘ అంటారు. విభేదాలు, ఇబ్బందులు ఏర్పడితే, చాలా తేలికగా విడాకులు తీసుకోవడానికి సిద్ధం అవుతారు. కానీ, దాంపత్య జీవితంలో సర్దుకు పోవడం చాలా అవసరం. భార్యాభర్తల మధ్య గొడవలు అనేది చాలా సహజం.

అయితే పరువు కోసం, సొసైటీ కోసం, పేరెంట్స్ కోసం 90 శాతం జంటలు మ్యారీడ్ లైఫ్ కంఫర్ట్ గా లేకున్నా అడ్జస్ట్ అవుతారు. సెలెబ్రిటీలు మాత్రం ఇవేమీ పరిగణలోకి తీసుకోరు. అది వారి వ్యక్తి’గతం. బయటికి చెప్పని కారణాలు ఎన్నో ఉంటాయి. ఏదేమైనా విడిపోడం అనేది భాధాకరం. చైతు – సామ్ విషయానికే వద్దాం.
వాళ్ళు పదేళ్ళ పాటు ప్రేమిచుకున్నారు. అయినా ఒకర్ని ఒకరు అర్ధం చేసుకోలేక పోయారు. అదేంటి అన్ని ఏళ్ళ తరవాత కూడా సర్డుకోలేకపోవటం ఏమిటి ? మనకు ఇది చిత్రంగా అనిపించొచ్చు. కానీ సమాజం ఎవరినీ పెళ్లి అనే బంధం పేరు చెప్పి.. బలవంతంగా కలిసే బతకాలి అని శాసించడం కరెక్ట్ కాదు. పెద్ద కుటుంబాల్లో పెద్ద భాద్యతలూ, కొన్ని కట్టుబాట్లు ఉంటాయి.
Also Read: SVR: ఈ తరానికి మరో ఎస్వీయార్ ఆయన !
ముఖ్యంగా వారికీ వారసత్వంగా సమాజంలో ఒక గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపు, కట్టుబాట్లు భవిష్యత్ కి, భావస్వేచ్ఛకి ఇబ్బందిగా పరిణమిస్తాయి. పేర్లు వైరల్ అవుతాయి. ఇవన్నీ ముందుగానే ఆలోచించుకోవాలి. అప్పుడు ఇరువైపులా ఏ ఇబ్బందీ ఉండదు. చిన్న కుటుంబాలు అయినా అంతే .. ఎంత చెట్టుకి అంత గాలి. ప్రపంచంలో ఎక్కడైనా ఇరు వ్యక్తుల మధ్య నచ్చినట్టు, నా ఇష్టం వచ్చినట్టు ఉండాలి అనేది పెళ్లి తరువాత ఇరువైపులా ఎవరికీ కుదరదు,
ఇద్దరికీ తమ జీవితాన్ని మార్చుకోవలసిన అవసరం నెమ్మదిగా ఏర్పడుతుంది.. ఆడవారికి ఇవి తప్పవు. ఎందుకంటే అది ప్రకృతి ధర్మం. దానికి సిద్దపడే పెళ్లి చేసుకోవాలి. ఆ సర్దుబాటు జరగనప్పుడు జరిగేవే విడిపోవడాలు. మోహావేశం ఉన్నంతవరకూ అన్నీ రంగుల కలలే, అంతా బాగానే ఉంటుంది. అయినా కలిసి వుండలేనప్పుడు అసలు ఎవరైనా పెళ్లి చేసుకోవటం ఎందుకు ?
Also Read: Celebrities Died: 2021లో మృతిచెందిన టాలీవుడ్ సెలబ్రెటీలు..!