
‘ఆల వైకుంఠపురం లో` చిత్రం ఘన విజయం తరవాత అల్లు అర్జున్ స్టార్ డమ్ ఊహించని రీతిలో పెరిగి పోయింది. సో దాన్ని మ్యాచ్ చేసుకోవడానికి రాబోయే చిత్రం విషయం లో అల్లు అర్జున్ పలు జాగ్రత్తలు తీసు కొంటున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ టైటిల్ తో రూపొందనున్న ఈ సినిమాలో కథానాయికగా రష్మిక మందన్న ను తీసుకున్నారు. అదే కోవలో ఐటమ్ సాంగ్ కోసం దిశా పటానిని సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తోంది.
గతం లో సుకుమార్ .. దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్లో వచ్చిన ఐటమ్ సాంగ్స్ అన్ని చార్ట్ బస్టర్స్ అయ్యాయి. దాంతో సుకుమార్ లేటెస్ట్ మూవీ ` పుష్ప ` మాస్ సబ్జెక్టుతో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో ఐటెం సాంగ్ కంపల్సరీ అని సుకుమార్ ఫిక్స్ అయిపోయాడట.
అదీగాక ` పుష్ప` పాన్ ఇండియా లెవెల్ మూవీ కావడంతో బాలీవుడ్ నుండే ఐటెం భామ ని తీసుకోవాలనుకొంటున్నాడు. సుకుమార్ …. ఆ క్రమం లో ` మలైకా అరోరా, `దిశా పటాని, `జాక్విలిన్ ఫెర్నాండేజ్ ` వంటి టాప్ ఐటెం భామలను లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. వారిలో లోఫర్ భామ దిశా పటాని వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నాడు. ఇక ఎప్పుడూ బిజీగా ఉండే దేవీశ్రీ ,ప్రసాద్ లాక్ డౌన్ కారణంగా తీరిగ్గా కూర్చుని మరీ ` పుష్ప’ సినిమాకి ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నాడట. ఆ క్రమంలో ఓ ఐటమ్ సాంగ్ సుకుమార్ , బన్నిలకు వినిపించడం, వాళ్ళకు నచ్చడం, ఒకే చేయడం కూడా జరిగిందట.