Heroines: ఇది పురుషాధిక్య ప్రపంచం.. ఈ ప్రపంచంలో స్త్రీ నిత్యం అనేక ప్రతికూలతలను ఎదుర్కొవాలి. ఇక సినిమా ఇండస్ట్రీలో కూడా హీరో, హీరోయిన్ల మధ్య అసమానతలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి రోజురోజుకూ ఇంకా పెరుగుతున్నాయి కూడా. ముఖ్యంగా పారితోషికం విషయంలో ఎక్కువ వ్యత్యాసాలు ఉంటాయి. హీరో స్టార్ అయితే, ఒక్కసారిగా ఇరవై కోట్లుకు పోతుంది అతని రెమ్యునరేషన్.

కానీ హీరోయిన్ సూపర్ స్టార్ అయినా హీరోకి ఇచ్చే దానిలో పావు కూడా ఇవ్వరు. ఉదాహరణకు అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ నటన ఎంత కీలకమో, ఆ సినిమా హీరోయిన్ నటన అంతకన్నా ఎక్కువ కీలకం. కానీ అర్జున్ రెడ్డి హిట్ తర్వాత, విజయ్ దేవరకొండ తన తర్వాత సినిమాలకు ఇరవై కోట్లు తీసుకుంటే.. షాలిని పాండేకి మాత్రం ఇరవై లక్షలు కూడా ఇచ్చేవారు లేకుండా పోయారు.
నిజానికి ఆమెకు ఛాన్స్ లు ఇచ్చేవారు కూడా లేరు. ఇది చాలదా హీరోయిన్ల పై ఎంతగా చులకన భావన ఉందో చెప్పడానికి. అందుకే చాలామంది హీరోయిన్లు ఈ విషయం పై ఎన్నోసార్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమ అసంతృప్తినంతా బయటికి బాహాటంగానే వెళ్లగక్కారు. అదేంటో ఒక హీరో ఏభై కోట్లు తీసుకుంటున్నాడు అంటే.. గొప్పగా చెప్పుకునే జనం.. ఒక స్టార్ హీరోయిన్ 2 కోట్లు డిమాండ్ చేసినట్టు ప్రచారం జరిగినా.. ఆమె పై నెగిటివ్ ప్రచారం చేస్తారు.
సోషల్ మీడియాలో ఆ హీరోయిన్ అంత అడిగింది అట ? ఈ హీరోయిన్ కి ఇంత ఎందుకు ఇవ్వాలి ? అంటూ పెద్ద ఎత్తున చర్చలు చేస్తారు. అసలు హీరోల రెమ్యునరేషన్‌పై స్పందించని వాళ్లు, హీరోయిన్ల పారితోషికం విషయంలో మాత్రం ఎందుకు రచ్చ చేస్తారు ? హీరోయిన్లు పారితోషికం ఎక్కువగా అడిగితే అదో ఏదో తమ సమస్యగా భావిస్తారు.
ఇదే హీరో రెమ్యునరేషన్ పెంచితే మాత్రం అది ఆ హీరోగారు తన నటనా కౌసల్యంతో సాధించిన సక్సెస్ గా అభివర్ణిస్తూ ఉంటారు. ఇప్పటికైనా ఈ వివక్ష మారాలి.