Varsham Re- Release: ఈ మధ్య కాలం లో రీ రిలీజ్ ట్రెండ్ టాలీవుడ్ లో జోరుగా కొనసాగుతుంది..సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా పోకిరి సినిమాని రీ రిలీజ్ చెయ్యగా అది ఎంత పెద్ద గ్రాండ్ సక్సెస్ అయ్యిందో మన అందరికి తెలిసిందే..ప్రపంచవ్యాప్తంగా సుమారు కోటి 75 లక్షల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది ఆ చిత్రం..ఇది చూసి పవన్ కళ్యాణ్ ఫాన్స్ ‘జల్సా’ సినిమాని ఆయన పుట్టిన రోజు నాడు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా స్పెషల్ షోస్ వేశారు.

ఈ సినిమా పోకిరి మూవీ స్పెషల్ షోస్ ని డబుల్ మార్జిన్ తో కొట్టి సుమారుగా 3 కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసి సంచలనం సృష్టించింది..ఈ రెండు సినిమాలు బాగా వర్కౌట్ అవ్వడం తో ఇక నిర్మాతలు మరియు డిస్ట్రిబ్యూటర్లు స్టార్ హీరోల కెరీర్ లో మైల్ స్టోన్స్ గా నిలిచినా సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు..ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా బిల్లా సినిమా ని విడుదల చెయ్యగా డీసెంట్ స్థాయి రెస్పాన్స్ ని దక్కించుకుంది.
ప్రభాస్ పుట్టినరోజు కి వారం రోజుల ముందు రెబెల్ సినిమాని ప్రదర్శించగా దానికి డిజాస్టర్ రెస్పాన్స్ వచ్చింది..కనీస స్థాయి వసూళ్లను కూడా ఈ సినిమా రాబట్టలేకపోయింది..ఇప్పుడు నవంబర్ 11 వ తేదీన ప్రభాస్ కెరీర్ లో మైలు రాయిగా నిలిచినా ‘వర్షం’ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు..దీనికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే హైదరాబాద్ లో ప్రారంభించగా మిశ్రమ స్పందన లభించింది..కేవలం RTC క్రాస్ రోడ్స్ ని మినహాయిస్తే మిగిలిన అన్ని థియేటర్స్ ఈ సినిమాకి పూర్ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి.

కనీస స్థాయి టికెట్స్ కూడా అమ్ముడుపోలేదు..ఇది గమనిస్తుంటే రీ రిలీజ్ ట్రెండ్ కి ప్రేక్షకులు ఇక మంగళం పాడినట్టే అని తెలుస్తుంది..నవంబర్ 19 వ తేదీన ఎన్టీఆర్ బాడ్షా సినిమా రీ రిలీజ్ అవుతుంది..దీనికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి..ఈ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ బద్రి మరియు ఎన్టీఆర్ ఆది వంటి సినిమాలు రీ రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి.