Directory Bobby : మెగా అభిమానులకు ఈ ఏడాది మొత్తం పండగే అని చెప్పొచ్చు..ఎందుకంటే ఏడాది ప్రారంభం తోనే మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమా తో సంచలన విజయాన్ని నమోదు చేసి అభిమానుల్లో సంతోషాన్ని నింపాడు..ఇదే ఊపులో ‘భోళా శంకర్’ మరియు పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ సినిమాలు కూడా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనే నమ్మకం తో ఉన్నారు..వరుసగా రెండు కమర్షియల్ ఫెయిల్యూర్స్ తర్వాత ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టాడు మెగాస్టార్.

ఇప్పటి వరకు ఈ చిత్రం విడుదలై 16 రోజులు పూర్తి చేసుకొని 130 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించిన సందర్భంగా ‘వీరయ్య విజయ విహారం’ పేరిట వరంగల్ లో వేలాది మంది అభిమానుల సమక్షం లో విజయోత్సవ సభ ని నిర్వహించారు..మెగా ఫ్యాన్స్ జీవితాంతం గుర్తుంచుకునేలా ఈ విజయోత్సవ సభ ఉంది..ఈ వేడుక లో చిరంజీవి పాటుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా పాల్గొన్నాడు.
ఈ సందర్భంగా డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ ‘ఇక్కడున్న జన సముద్రం చూస్తూ ఉంటె రోమాలు నిక్కపొడుస్తున్నాయి..ఈ సినిమాని ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసినందుకు ప్రతీ ఒక్కరికి పేరుపేరున ధన్యవాదాలు చెప్తున్నాను..నన్ను నమ్మి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చినందుకు చిరంజీవి గారికి జీవితాంతం రుణపడి ఉంటాను..ఇక మా మాస్ మహారాజ రవితేజ గురించి చెప్పాలి..అన్నయ్య చిరంజీవి గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు..రవితేజ లేకపోతే ‘వాల్తేరు వీరయ్య’ ఇంత అద్భుతంగా వచ్చేది కాదు..అవును అన్నయ్య రవితేజ లేకపోతే వాల్తేరు వీరయ్య సినిమానే లేదు’ అంటూ డైరెక్టర్ బాబీ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి..ఈ విజయోత్సవ సభకి రవితేజ వస్తాడని మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించారు కానీ ఆయనకీ షూటింగ్ ఆలస్యం అవ్వడం తో రాలేకపోయాడట..అలా ఒకే వేదిక మీద చిరంజీవి – రామ్ చరణ్ – రవితేజ లను చూసే భాగ్యం కలుగుతుందని అనుకున్న మెగా అభిమానులకు నిరాశే మిగిలింది.