https://oktelugu.com/

Star Directors: ఒక్క ఛాన్స్ తో వందల కోట్లు కొల్లగొట్టింది వీళ్ళే !

Star Directors: ఇండియన్ సినీ ఇండస్ట్రీలో టాలెంట్ ఉండి కూడా, హీరో దొరకని దర్శకులు ఎందరో ఉన్నారు. సుకుమార్, కొరటాల శివ, వంశీ పైడిపల్లి వంటి దర్శకులు బ్లాక్ బస్టర్స్ హిట్స్ కొట్టి కూడా మరో స్టార్ హీరో డేట్లు కోసం ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సి వచ్చింది. తమ కథకు తగ్గ స్టార్ హీరో దొరకక, చిన్న హీరోలతో సినిమాలు చేయలేక చాలా కాలం తర్వాత వీళ్లంతా ప్రాజెక్ట్స్ సెట్ చేసుకున్నారు. అలాగే, కొందరు స్టార్ […]

Written By:
  • Shiva
  • , Updated On : April 21, 2022 / 01:32 PM IST
    Follow us on

    Star Directors: ఇండియన్ సినీ ఇండస్ట్రీలో టాలెంట్ ఉండి కూడా, హీరో దొరకని దర్శకులు ఎందరో ఉన్నారు. సుకుమార్, కొరటాల శివ, వంశీ పైడిపల్లి వంటి దర్శకులు బ్లాక్ బస్టర్స్ హిట్స్ కొట్టి కూడా మరో స్టార్ హీరో డేట్లు కోసం ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సి వచ్చింది. తమ కథకు తగ్గ స్టార్ హీరో దొరకక, చిన్న హీరోలతో సినిమాలు చేయలేక చాలా కాలం తర్వాత వీళ్లంతా ప్రాజెక్ట్స్ సెట్ చేసుకున్నారు.

    Prashanth Neel

    అలాగే, కొందరు స్టార్ హీరోలు కంటెంట్ ఉన్న డైరెక్టర్ల కోసం ఏళ్ల తరబడి రిక్వెస్ట్ లు చేసిన సంఘటనలు ఉన్నాయి. ఉదాహరణకు.. దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో సినిమా చేయడం కోసం, స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఐదు సంవత్సరాలు వెయిట్ చేశాడు. మహేష్ కూడా రాజమౌళితో సినిమా చేయడానికి ఆరు సంవత్సరాల నుంచి ఆసక్తి చూపిస్తున్నాడు.

    ప్రస్తుతం విషయం ఉన్న డైరెక్టర్లకు అంత డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఒక స్టార్ డైరెక్టర్ కి ఉన్న డిమాండ్, మీడియం రేంజ్ హీరోలకు కూడా లేదు. అయితే కొంతమంది డైరెక్టర్లు కేవలం ఒకే ఒక్క సినిమాతోనే గొప్ప స్టార్ స్టేటస్ ను సాధించారు. మరి ఒక్క సినిమాతో సూపర్ సక్సెస్ కొట్టిన ఆ డైరెక్టర్లు ఎవరు ? వాళ్ళ కథ ఏమిటో చూద్దాం.

    ప్రశాంత్ నీల్ :

    Prashanth Neel

    కొన్నేళ్ల క్రితం వరకు తెలుగు ప్రేక్షకులకు, ‘ప్రశాంత్ నీల్’ అనే దర్శకుడు ఉన్నాడనే తెలియదు. ఒకే ఒక్క సినిమా.. అదే ‘కేజీఎఫ్ ఛాప్టర్ 1’. దెబ్బకు ప్రశాంత్ నీల్ పేరు నేషనల్ రేంజ్ లో మారుమ్రోగింది. ‘కేజీఎఫ్ 2’ విజయంతో ప్రశాంత్ నీల్ దేశంలోని టాప్ 4 డైరెక్టర్ల జాబితాలో ఒకడిగా నిలిచాడు.

    Also Read: Chiranjeevi- NTR: తార‌క్ తో పోటీ వ‌ద్ద‌ని సినిమా వాయిదా వేసుకున్న చిరు.. అస‌లేమైందంటే..?

    నాగ్ అశ్విన్ :

    Nag Ashwin

    ‘మహానటి’ సినిమాతో దక్కిన స్టార్ డమ్ నాగ్ అశ్విన్ కెరీర్ కు ఎంతగానో ఉపయోగపడింది. తన సినిమా మహానటి.. నాగ్ అశ్విన్ ను ఓవర్ నైట్ లోనే స్టార్ డైరెక్టర్ ను చేసింది. ప్రస్తుతం నాగ్ అశ్విన్ ‘ప్రాజెక్ట్ కె’ సినిమాతో నేషనల్ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాడు.

    సందీప్ రెడ్డి వంగా :

    Sandeep Reddy Vanga

    అర్జున్ రెడ్డి అనే సినిమా సక్సెస్ తో ఒక్కసారిగా స్టార్ అయిపోయాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. బాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా ఈ డైరెక్టర్ కి భారీ ఆఫర్లు వస్తున్నాయి. కారణం ఒకే ఒక్క సినిమా ‘అర్జున్ రెడ్డి’.

    ఓం రౌత్ :

    Om Raut

    నిజానికి ఓం రౌత్ ఎవరో కూడా సౌత్ ప్రేక్షకులకు తెలియదు. కానీ ప్రభాస్ డేట్లు ఎందుకు ఇచ్చాడు ? ‘తానాజీ’ అనే తన సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోనే స్టార్ డైరెక్టర్ అయిపోయాడు ఓం రౌత్. ప్రస్తుతం ఓం రౌత్ ప్రభాస్ తో ఆదిపురుష్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఒక్క ఛాన్స్ అంటూ ఒక్క సినిమాతో వందల కోట్లు కొల్లగొట్టింది వీళ్ళే. పైగా వంద సినిమాల క్రేజ్ ను తెచ్చుకోవడం కూడా వీరికి మాత్రమే సాధ్యం అయ్యింది.

    Also Read:Rajamouli Eega Movie: ఆయ‌న మీద కోపంతోనే జ‌క్క‌న్న ఈగ మూవీని తీశాడంట‌..!

    Recommended Videos:

    Tags