
ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక్కటే టాపిక్. కాస్త విషయం ఉన్న డైరెక్టర్ ను కదిలించినా ఒక్కటే టాపిక్.. అదే మెగాస్టార్ కి కథ. మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాకా.. వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ కుర్రాళ్లకు పోటీ ఇస్తున్నాడు. వయసు పై బడిన అదే ఉత్సాహంతో దూసుకుపోతున్నాడు. ఇంతవరకూ బాగానే ఉంది. కాకపోతే ఈ మధ్య మెగాస్టార్ కి కథలే అసలు నచ్చడం లేదట. ఎంతమంది బడా దర్శకులు ఇంటికి వచ్చి.. గొంతు అరిగిపోయేలా కథలు చెప్పినా.. అవి చిరు మనసును తాకలేకపోతున్నాయట.
Also Read: ప్రభాస్ బాడీపై శ్రీరెడ్డి హాట్ కామెంట్స్
దాంతో మెగాస్టార్ టీమ్ ఒక నిర్ణయానికి వచ్చి.. ఇండస్ట్రీలో కొత్త పాత అనే తేడా లేకుండా కొత్త కథలు ఉంటే పట్టుకురండి అంటూ మెసేజ్ లు పాస్ చేశారు. అసలుకే అవకాశాల కోసం అర్రులు చాస్తోన్న వేళ.. ఏకంగా మెగాస్టార్ నుండే ఇలా కాల్ వచ్చే సరికి ఇక ఎందుకు ఆగుతారు ? అందుకే ఇప్పటికే చాలామంది డైరెక్టర్లు మెగాస్టార్ కోసం కొత్త కథలు రాయడం మొదలెట్టారు. కొంతమంది ఆల్ రెడీ చిరుకి కథలు వినిపించారు. అందులో ఒకటి రెండు చిరుకి నచ్చాయి. కానీ ఇంకా ఫైనల్ చేయలేదు. మిగితా దర్శకుల దగ్గర నుండి కూడా కథలు విని.. అప్పుడు అన్నిటిలో నుండి బెస్ట్ వాటని ఓకే చేస్తారట.
ఈ క్రమంలోనే మరో ఇద్దరు దర్శకులు చిరుకి కథలు చెప్పడానికి రెడీ అయిపోయారు. కామెడీతో వరుస హిట్స్ అందుకుంటున్న అనిల్ రావిపూడి మెగాస్టార్ కోసం ఒక అదిరిపోయే మాస్ ఎంటర్ టైనర్ ను రెడీ చేసాడు. వచ్చే వారంలో చిరును కలిసి కథ వినిపిస్తాడట. అలాగే మరో యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల కూడా చిరు కోసం ఫుల్ ఎంటర్ టైన్మెంట్ తో సాగే స్క్రిప్ట్ రెడీ చేస్తోన్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ తన కథను ఓకే చేస్తాడు అని ఈ యంగ్ డైరెక్టర్ ఆశ పడుతున్నాడు. మరి చూడాలి వెంకీ, అనిల్ కథలు.. మెగాస్టార్ కి ఎంతవరకు నచ్చుతాయో.
Also Read: చిరంజీవి రీమేక్ స్టారా..? సూపర్ హిట్లన్నీ అవేనా..?!
ప్రస్తుతం మలయాళంలో ‘లూసిఫర్’ అనే సినిమా సూపర్ హిట్ సినిమా చిరంజీవి దగ్గరకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు వేదాళమ్, ఆచార్య సినిమాలను కూడా చిరు ప్రస్తుతం చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
Comments are closed.