Rajamouli Impact on Directors: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పెను మార్పులను చేస్తూ చాలామంది దర్శకులు కొత్త కథలతో సినిమాలను చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలోనే పాన్ ఇండియాలో చాలా సినిమాలకు సీక్వెల్స్ చేస్తూ ఆ సినిమాలో ఉన్న మెయిన్ కంటెంట్ ని చంపేస్తున్నారు అంటూ కొన్ని అభిప్రాయాలైతే వెలవడుతున్నాయి. నిజానికి రాజమౌళి బాహుబలి సినిమా చేసి సూపర్ సక్సెస్ ని సాధించడంతో అప్పటినుంచి ప్రతి ఒక్కరు సీక్వెల్స్ మీద పడ్డారు. రాజమౌళి కూడా బాహుబలిని మొదట ఒకే పార్ట్ గా చేద్దామని అనుకున్నప్పటికి బడ్జెట్ వర్కౌట్ అవ్వదనే ఉద్దేశ్యంతో దానిని రెండు పార్టులుగా చేశాడు. దాంతో సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. ఇక అప్పటినుంచి ప్రతి ఒక్కరు అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి సినిమాని పాన్ ఇండియాలో రిలీజ్ చేయడానికి రెండు పార్టులుగా చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో కొంతమంది వరుస సక్సెస్ లను సాధిస్తుంటే మరి కొంత మంది మాత్రం బొక్క బోర్లా పడుతున్నారు.దీనివల్ల ప్రొడ్యూసర్లకు విపరీతమైన నష్టాలు కూడా వస్తున్నాయి. ఒకరకంగా రాజమౌళి నే వీళ్ళందర్నీ చెడగొట్టారు అంటూ కొంతమంది సినిమా మేధావులు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
Also Read: మహేష్ బాబు – పూరి జగన్నాథ్ మధ్య వైరానికి కారణం వాళ్లేనా..?
ఇక మరి కొంతమంది రాజమౌళి అభిమానులు మాత్రం రాజమౌళి ఎలాంటి సినిమాలు చేయాలి అనే స్ట్రాటజీ మెయింటైన్ చేస్తు ఎంత బడ్జెట్ ను పెడితే అంతకు డబుల్ కలెక్షన్స్ వస్తాయి అనే ఒక క్యాలిక్యులేషన్స్ తో ముందుకెళ్తాడు. కాబట్టి రాజమౌళి సక్సెస్ ని సాధించాడు. ఆయనను చూసి సీక్వెల్స్ తీసే వాళ్ళు కూడా ఆయన ఎలాంటి ఫార్మాట్ ను ఫాలో అవుతున్నాడు అలాంటి పద్ధతిని అనుసరిస్తే వాళ్లకు కూడా సక్సెస్ లు వస్తాయి.
అందులో రాజమౌళి తప్పేముంది అంటూ రాజమౌళికి సపోర్ట్ చేస్తున్నారు…ఇక ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో చేస్తున్న సినిమా కూడా రెండు పార్టులుగా రాబోతుంది అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయాల మీద సరైన క్లారిటీ అయితే రావడం లేదు.
Also Read: స్పిరిట్ మూవీకి సందీప్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..?
రాజమౌళి స్వతహాగా స్పందిస్తే తప్ప దీనికి సంబంధించిన క్లారిటీ అనేది రావడం లేదు కాబట్టి ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ ఎలివేట్ చేసుకోవాలంటే మాత్రం సూపర్ సక్సెస్ ని సాధించాల్సిన అవసరమైతే ఉంది…ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి దారిలోనే మిగతా దర్శకులందరు ఫాలో అవుతుండటం కొంతవరకు బెటర్ అయినప్పటికి అతనిలా ప్రతి సినిమాను రెండు పార్టులుగా చేసి సక్సెస్ కొట్టాలనుకోవడం కరెక్ట్ కాదు…