https://oktelugu.com/

మొద‌ట్లో చిరంజీవికి వీరాభిమాని.. క‌ట్ చేస్తే మెగాస్టార్ కే బంపర్ హిట్లు ఇచ్చిన స్టార్ డైరెక్టర్..

Director VV Vinayak: మెగాస్టార్ చిరంజీవి తెలుగు ఇండస్ట్రీలో లెజెండరీ యాక్టర్. ఆయనతో ఓ సినిమా అయినా చేయాలనేది ప్రతి డైరెక్టర్ కల. రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, బి.గోపాల్ ఇలా తదితర డైరెక్టర్లు చిరంజీవితో సినిమా తీసి బాక్సాఫీసును షేక్ చేశారు. అయితే డైరెక్టర్ వివి. వినాయక్‌ది సపరేట్ రూట్. ఈయన తన చిన్నతనంలో చిరంజీవికి వీరాభిమాని. అప్పట్లో చిరంజీవి సినిమా విడుదల అయితే వినాయక్ చేసే హంగామా అంతా‌ఇంతా కాదు. వినాయక్ స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా కొవ్వొరు […]

Written By:
  • admin
  • , Updated On : January 4, 2022 9:23 am
    Follow us on

    Director VV Vinayak: మెగాస్టార్ చిరంజీవి తెలుగు ఇండస్ట్రీలో లెజెండరీ యాక్టర్. ఆయనతో ఓ సినిమా అయినా చేయాలనేది ప్రతి డైరెక్టర్ కల. రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, బి.గోపాల్ ఇలా తదితర డైరెక్టర్లు చిరంజీవితో సినిమా తీసి బాక్సాఫీసును షేక్ చేశారు.

    అయితే డైరెక్టర్ వివి. వినాయక్‌ది సపరేట్ రూట్. ఈయన తన చిన్నతనంలో చిరంజీవికి వీరాభిమాని. అప్పట్లో చిరంజీవి సినిమా విడుదల అయితే వినాయక్ చేసే హంగామా అంతా‌ఇంతా కాదు. వినాయక్ స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా కొవ్వొరు సమీపంలోని చాగల్లు. ఆ గ్రామంలో చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్‌కు ప్రెసిడెంట్‌గా పనిచేశాడు ఈ స్టార్ డైరెక్టర్.

    Director VV Vinayak with Chiranjeevi

    Director VV Vinayak with Chiranjeevi

    వినాయక్ చిన్నతనంలో వారికి సొంతంగా థియేటర్ ఉండేది. అలాగే రాజమండ్రిలోని కొన్ని థియేటర్లను లీజ్‌కు తీసుకుని నడిపించారు వినాయ‌క్ తండ్రి కృష్ణారావు. జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాకు వినాయక్ స్వగ్రామంలో పండగలా చేశారంటా. ఒక పక్క భారీ వర్షం పడుతున్నా.. చాగల్లు నుంచి రాజమండ్రి వరకు కార్లతో భారీ ర్యాలీగా తరలివెళ్లి కుమారి టాకీస్‌లో సినిమా చూశారంటా. ఇందు కోసం తన తండ్రి సహాయంతో ప్రత్యేకంగా టిక్కెట్లు తెప్పించుకుని మరీ సినిమా చూశారంటా వివి వినాయక్.

    Also Read: “కల్లోలం” అంటూ స్టెప్పులతో దుమ్ము రేపుతోన్న చిరు… అందాల ఆరబోతలో రెజీనా ఫుల్ ట్రీట్

    అటు తరువాత వినాయక్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తన మొదటి సినిమా జూనియర్ ఎన్టీఆర్‌తో తీసిన ‘ఆది’ సూపర్ హిట్ కొట్టింది. అయితే తన మూడో సినిమా అయిన ఠాగూర్‌ను తన అభిమాన నటుడు చిరంజీవితో తీసే అదృష్టం వినాయక్‌ను వరించింది. ఈ సినిమా కూడా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ సినిమాలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడే వ్యక్తిగా చిరంజీవి నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.

    చిరంజీవి చాలా గ్యాప్ తరువాత సినిమాల్లో నటించడం మొదలు పెట్టారు. మెగాస్టార్ కం బ్యాక్ సినిమా ఖైదీ నెంబర్ 150 చిత్రాన్ని వినాయక్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఇలా తన అభిమాన నటుడితో తీసిన రెండు సినిమాలు హిట్ కావడంతో వివి వినాయక్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్‌గా ఎదిగాడు.

    Also Read: ఆలు లేదు, చూలు లేదు.. అప్పుడే ప్లానింగ్ ఏమిటి అనిల్ ?

    Tags