https://oktelugu.com/

ఈ టాలెంటెడ్ డైరెక్టర్ బాధ వర్ణనాతీతం !

ఇండస్ట్రీలో డబ్బులు ఎక్కువ ఉంటాయి. ఒక సినిమా హిట్ అయితే చాలు.. ఇక ఆ సినిమాకి పని చేసిన అందరి జీవితాలు మారిపోతాయి. రాత్రికి రాత్రే కోట్లు వచ్చి పడతాయి లాంటి మాటలు ఇండస్ట్రీ పై ఆసక్తి ఉన్నవారు తరుచుగా చెబుతూ ఉంటారు. కానీ నిజానికి వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉండటం నిజంగా విచిత్రమే. ఒక చిన్న సినిమాతో పెద్ద హిట్ తీసిన డైరెక్టర్ కి ఎంత డిమాండ్ ఉండాలి. ఎన్ని కోట్లు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : November 11, 2020 / 05:17 PM IST
    Follow us on

    ఇండస్ట్రీలో డబ్బులు ఎక్కువ ఉంటాయి. ఒక సినిమా హిట్ అయితే చాలు.. ఇక ఆ సినిమాకి పని చేసిన అందరి జీవితాలు మారిపోతాయి. రాత్రికి రాత్రే కోట్లు వచ్చి పడతాయి లాంటి మాటలు ఇండస్ట్రీ పై ఆసక్తి ఉన్నవారు తరుచుగా చెబుతూ ఉంటారు. కానీ నిజానికి వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉండటం నిజంగా విచిత్రమే. ఒక చిన్న సినిమాతో పెద్ద హిట్ తీసిన డైరెక్టర్ కి ఎంత డిమాండ్ ఉండాలి. ఎన్ని కోట్లు అడ్వాన్స్ లు రావాలి. కానీ అవ్వేమి లేకపోగా.. రెండో సినిమా పూర్తి చేయడానికి గత రెండు సంవత్సరాల నుండి తెగ కష్ట పడుతున్నాడు ఆ డైరెక్టర్. కానీ సినిమా మాత్రం పూర్తి అవ్వట్లేదు. అలా అని డబ్బులు వస్తున్నాయా అంటే.. అదీ లేదు.

    Also Read..గబ్బర్ సింగ్ కాంబో రిపీట్.. రేటు పెంచిన డీఎస్పీ..!

    ‘నీది నాది ఒకే కథ’ అనే చిన్న బడ్జెట్ సినిమాలో కొత్త ఎలిమెంట్స్ ను జోడించి మంచి హిట్ ను అందుకున్నాడు యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ‘వేణు ఉడుగుల. కేవలం కథతోనే తనకు హిట్ వచ్చిందని చెప్పే ఈ డైరెక్టర్.. కథకు బాగా టైం కేటాయిస్తాడు. ఇప్పుడు అదే ఆయన్ను ఇబ్బంది పెడుతుంది. ప్రస్తుతం ఈ యంగ్ డైరెక్టర్ తన రెండో చిత్రంగా రానా, సాయిప‌ల్ల‌విలను హీరోహరోయిన్లుగా పెట్టి ‘విరాటపర్వం’ అనే పొలిటికల్‌ పీరియాడిక్ థ్రిల్లర్ ను దాదాపు మూడు సంవత్సరాల నుండి చేస్తున్నాడు. ఈ సినిమాకి అంత టైం పట్టడానికి ప్రధాన కారణం.. ఈ సినిమా కథే. కథలోని పాత్రలు ఎక్కువగా ఉండటం.. పైగా అన్ని పాత్రలు కీలకమైనవి కావడం.. దాంతో అన్ని పాత్రలకు ఫామ్ లో ఉన్న నటీనటులను ఎంపిక చేసుకుని.. వారి డేట్లు సెట్ చేసుకుని సినిమా పూర్తి చేయడానికే చాలా టైం పడుతుంది.

    Also Read..బాలయ్యకు జోడీ కుదిరింది.. పెళ్లి తర్వాత రీ ఎంట్రీ..!

    అసలుకే ఈ సినిమా తీయడం ఆలస్యం అనుకుంటే.. మధ్యలో కరోనా.. ఆ తరువాత షూట్ చేద్దామనుకుంటే.. రానా పెళ్లి… పెళ్లి మూడ్ లో రానా ఇప్పట్లో ఈ సినిమాకి డేట్స్ ఇవ్వలేనని క్లారిటీ ఇచ్చాడు. మరో పక్క సాయి పల్లవి వచ్చే ఏడాది మొత్తం ఫుల్ బిజీ. ఆమె చేతిలో ఇప్పటికే ఐదు పెద్ద సినిమాలు. సో..ఆ సినిమాలను కాదు అని సాయి పల్లవి విరాటపర్వంకు డేట్స్ ఇవ్వలేదు. అంటే, దాదాపు మరో సంవత్సరం దాకా విరాటపర్వం సినిమా షూట్ లేనట్లే. దాంతో వేణు ఉడుగుల ఈ సినిమా కోసం చాలా కష్టపడాల్సి వస్తోంది. ఇప్పటికే నాలుగేళ్లు ఈ సినిమా కోసం పెట్టాడు. ఇప్పుడు మరో ఏడాది పెట్టాలి. ఇన్నేళ్లు పెట్టినా వచ్చేది మాత్రం అరకొర రెమ్యునరేషనే అని టాక్. పాపం ఈ టాలెంటెడ్ డైరెక్టర్ బాధ వర్ణనాతీతమే అనుకోవాలి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్