Vamshi Paidipally: దర్శకుడు వంశీ పైడిపల్లి పరిశ్రమకు వచ్చి దాదాపు 16 ఏళ్లు అవుతుంది. ఇన్నేళ్లలో ఆయన చేసింది కేవలం ఆరు సినిమాలు. రాజమౌళి కంటే కూడా స్లోగా సినిమాలు చేశారు. సినిమా సినిమాకు కనీసం మూడేళ్ల గ్యాప్ తీసుకున్నాడు. అలా అని భారీ పాన్ ఇండియా సినిమాలు, విజువల్స్ వండర్స్ తీశారా అంటే అదీ లేదు. అందరు దర్శకులు మాదిరే మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ చేశారు. 2007లో దర్శకుడిగా వంశీ పైడిపల్లి ప్రస్థానం మొదలైంది. ప్రభాస్ హీరోగా మున్నా తెరకెక్కించారు. రివేంజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన మున్నా యావరేజ్ అని చెప్పాలి. ఇలియానా హీరోయిన్ గా నటించారు. హరీష్ జయ్ రాజ్ మ్యూజిక్ ఫుల్ కిక్ ఇచ్చింది.

మున్నా విడుదలైన మూడేళ్లకు బృందావనం చేశారు. ఎన్టీఆర్ హీరోగా ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు. కాజల్, సమంత హీరోయిన్స్ గా నటించిన బృందావనం సూపర్ హిట్ కొట్టింది. ఎన్టీఆర్ ని కొత్తగా చూపించడంలో వంశీ పైడిపల్లి సక్సెస్ అయ్యాడు. థమన్ సాంగ్స్ అలరించాయి. సూపర్ హిట్ కొట్టినా వెంటనే మూవీ చేసే ఆలోచన చేయలేదు. ఈసారి ఏకంగా నాలుగేళ్ల సమయం తీసుకున్నాడు. రామ్ చరణ్ తో ఎవడు చిత్రం తెరకెక్కించారు. అల్లు అర్జున్ క్యామియో రోల్ చేసిన ఎవడు హిట్ టాక్ తెచ్చుకుంది.
ఎవడు విడుదలైన రెండేళ్లకు మల్టీస్టారర్ ఊపిరి చేశారు. కార్తీ, నాగార్జున హీరోలుగా నటించారు. ది ఇన్ టచబుల్స్ అనే హాలీవుడ్ చిత్రానికి ఊపిరి రీమేక్. ఊపిరి అబౌవ్ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. నిజానికి ఈ మూవీ ఎన్టీఆర్ తో చేద్దాం అనుకున్నారు. మొదట్లో ఆసక్తి చూపిన ఎన్టీఆర్ తర్వాత చేయనని చెప్పేశాడు. ఊపిరి అనంతరం మహర్షి చిత్రం చేశాడు. ఈ రెండు చిత్రాలు మధ్యలో మూడేళ్ళ గ్యాప్ పడింది. మహర్షి సూపర్ హిట్ కాగా వారసుడు మరో మూడేళ్లకు చేశాడు.

స్టార్ హీరోలతో సూపర్ హిట్స్ కొడుతున్నా గ్యాప్ ఎందుకు వస్తుందంటే మనోడు సినిమా తీయాలంటే మినిమమ్ స్టార్ హీరో కావాలి. అందుకోసం సహనంగా వేచి చూస్తాడే కానీ టైర్ టూ హీరోల జోలికిపోడు. ఆకలితో ఉన్న పులి వేట కోసం ఎదురుచూసినట్లు చూసి భారీ ప్రాజెక్ట్ సెట్ చేస్తాడు. స్టార్ హీరో సినిమా అంటే కనీసం పది కోట్లకు పైనే రెమ్యూనరేషన్ ఉంటుంది. ఈ మధ్య కొందరు డైరెక్టర్స్ పాతిక కోట్లు కూడా తీసుకుంటున్నారు. ఇన్నేళ్ల కెరీర్లో వంశీ పైడిపల్లి చేసిన హీరోల్లో కార్తీ మాత్రమే చిన్న హీరో అని చెప్పొచ్చు. ఆ మూవీ కూడా ఎన్టీఆర్ తో సెట్ కాక కార్తీతో చేశాడు. నెక్స్ట్ మళ్ళీ విజయ్ తో మూవీ ఓకే చేశాడనే టాక్ వినిపిస్తుంది.