Trivikram Srinivas
Trivikram Srinivas: మన తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకులలో ఒకరు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas). విజయ్ భాస్కర్ అనే టాప్ మోస్ట్ డైరెక్టర్ వద్ద రచయితగా కెరీర్ ని మొదలుపెట్టిన త్రివిక్రమ్ శ్రీనివాస్, ఆ తర్వాత దర్శకుడిగా మారి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించాడు. ఆయన రాసిన డైలాగ్స్, ఆయన తీసిన క్లాసిక్స్ ని మన తెలుగు ప్రేక్షకులు జీవితాంతం మర్చిపోలేరు. రోజువారీ జీవితంలో ఎంతో కష్టపడి పనిచేసి ఇంటికి తిరిగి వచ్చే సగటు ప్రేక్షకుడికి నిజమైన వినోదం దక్కేది త్రివిక్రమ్ సినిమాల్లోని సన్నివేశాలను యూట్యూబ్ లో చూసినప్పుడే. అలాంటి అద్భుతమైన సినిమాలను తెరకెక్కించాడు ఆయన. ‘నువ్వే నువ్వే’, ‘అతడు’, ‘జల్సా’, ‘ఖలేజా’, ‘జులాయి’, ‘అత్తారింటికి దారేది’,’అ..ఆ’ ,’సన్ ఆఫ్ సత్యమూర్తి’, ‘అజ్ఞాతవాసి’, ‘అరవింద సమేత’, ‘అలా వైకుంఠపురంలో’, ‘గుంటూరు కారం’ వంటి చిత్రాలను తెరకెక్కించాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. వీటిలో కేవలం ఖలేజా, అజ్ఞాతవాసి, గుంటూరు కారం చిత్రాలు మాత్రమే ఫ్లాప్ అయ్యాయి.
ముఖ్యంగా ‘గుంటూరు కారం’ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్నో విమర్శలు అందుకున్నాడు. ఆయన పని ఇక అయిపోయింది అంటూ సోషల్ మీడియా లో ఎన్నో కామెంట్స్ వినిపించాయి. కానీ స్క్రిప్ట్ లో మహేష్ బాబు అప్పటికప్పుడు మార్పులు చేయమని చెప్పడం వల్లే అలాంటి ఔట్పుట్ వచ్చింది అనేది మరో వాదన. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త ఏమిటంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. అదేంటి రేపో మాపో అల్లు అర్జున్ తో సినిమా ప్రారంభించబోతున్నాడని వార్తలు వినిపించాయి, ఇప్పుడు అకస్మాత్తుగా ఈ వార్త వినిపిస్తుందేంటి అని మీరు అనుకోవచ్చు. అల్లు అర్జున్(Icon Star Allu Arjun) తో సినిమా అయితే కచ్చితంగా ఉంది, కానీ అది ఇప్పట్లో మొదలయ్యే అవకాశాలు మాత్రం లేవట. అందుకే అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని ముందుగా అట్లీ తో చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.
అల్లు అర్జున్ కి ముందుగా త్రివిక్రమ్ తోనే చేయాలని ఆతృతగా ఉందట. ఎందుకంటే స్టోరీ లైన్ అలాంటిది. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్(Deputy Cm Pawan Kalyan) రాజకీయ వ్యవహారాల్లో తలదూర్చడం వల్ల ఆయనకు అసలు సమయమే దొరకడం లేదట. వారం లో 3 నుండి 4 రోజులు ఆయన అమరావతి లోనే ఉంటున్నాడట. పవన్ కళ్యాణ్ కి త్రివిక్రమ్ కి మధ్య ఎంత గొప్ప సాన్నిహిత్యం ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బహుశా ప్రాణస్నేహితులంటే ఇలాగే ఉంటారేమో అని అనిపించేంత గొప్ప స్నేహం వీళ్లది. పవన్ కోసం తన కెరీర్ ని కూడా త్యాగం చేయడానికి త్రివిక్రమ్ సిద్దమే. త్రివిక్రమ్ తీరు చూస్తుంటే, అల్లు అర్జున్ తో చేయబోయేదే చివరి సినిమా అని, ఆ తర్వాత ఆయన శాశ్వతంగా సినిమాల నుండి తప్పుకొని, 2029 ఎన్నికలలో జనసేన పార్టీ లో చేరి ఎమ్యెల్యే గా పోటీ చేసి మంత్రి పదవి చేపట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.