Akhil Agent: స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో అక్కినేని నట వారసుడు అఖిల్ నటిస్తున్న కొత్త సినిమా ‘ఏజెంట్’. ఈ సినిమా క్లైమాక్స్ ను ప్రస్తుతం షూట్ చేస్తున్నారు. అయితే, ఈ వారసత్వ హీరోకి అందం వుంది. కానీ అభినయం పెద్దగా లేదు. అఖిల్ కి మొదటి నుంచి ఇదే సమస్య. ఇక ఏజెంట్ క్లైమాక్స్ షూటింగ్ లో అఖిల్ అభినయం డైరక్టర్ సురేందర్ రెడ్డికి సంతృప్తినివ్వడం లేదు.

దాంతో ‘ఈ రోజుకు ఇక చాలు’ అంటూ మొన్న సురేందర్ రెడ్డి షూట్ కి ప్యాకప్ చెప్పాడు. మరుసటి రోజు ఇదే వ్యవహారం. సినిమా మొత్తానికే క్లైమాక్స్ చాలా కీలకం. అందుకే.. ఈ క్లైమాక్స్ విషయంలో సురేందర్ రెడ్డి అస్సలు కాంప్రమైజ్ కావడం లేదు. మరోపక్క అఖిల్ సరిగ్గా చేయలేకపోతున్నాడు. దాంతో సురేందర్ రెడ్డి.. ‘యాక్టింగ్ నేర్చుకుని సెట్ కి రావాలి కదా ?’ అంటూ నవ్వుతూనే క్లాస్ పీకుతున్నాడట.
Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ షాకింగ్ నిర్ణయం.. బాధలో టాలెంటెడ్ డైరెక్టర్
పాపం అఖిల్.. అసలుకే హిట్ లేదు, ఇటు యాక్టింగ్ కూడా లేదు అని డైరెక్టర్లే డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు. అసలు ఈ విషయంలో ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అఖిల్ కి అర్ధం కావడం లేదట. పైగా అఖిల్ ను నమ్ముకుని 40 కోట్లకు పైగా పెట్టుబడి పెడుతున్నారు. అన్నింటికి మించి సురేందర్ రెడ్డి ఫ్లాప్ లో వున్నాడు. ఈ సినిమా హిట్ కాకపోతే. సురేందర్ రెడ్డికు కూడా సమస్యే.

అందుకే.. సురేందర్ రెడ్డి ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. నిజానికి ‘ఏజెంట్’ సినిమా కోసం అఖిల్ తన నరాలు కూడా బలంగా లావుగా కనిపించేంతగా బాడీని పెంచాడు. కండలు తిరిగిన దేహంతో ఒళ్ళు విరుచుకుంటూ అఖిల్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. అఖిల్ ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు.
కానీ అఖిల్ కష్టానికి విలువ లేకుండా పోతుంది. నటన విషయంలో కొంత వెంక పడటమే మెయిన్ కారణం. మరోపక్క సురేందర్ రెడ్డి.. మెగాస్టార్ తో వందల కోట్ల బడ్జెట్ తో ‘సైరా’ తీశాడు. ఆ సినిమా నిర్మాతకు భారీ నష్టాలను మిగిల్చాడు. మరి, ఇప్పుడు అఖిల్ పై కూడా భారీ బడ్జెట్ పెట్టి ప్లాప్ తీస్తే.. ఇక కెరీర్ పోయినట్టే. అందుకే ఎవరి బాధలో వాళ్ళు ఉన్నారు.
[…] […]
[…] […]