https://oktelugu.com/

Surender Reddy: సురేందర్ రెడ్డికి ఏజెంట్ కష్టాలు షురూ!

భారీ బడ్జెట్ చిత్రాలు డిజాస్టర్ అయితే నిర్మాతలకు కష్టాలే. నష్టాలు చవిచూసిన బయ్యర్లు రోడ్లెక్కుతారు. ఈ మధ్య కాలంలో ఆచార్య, లైగర్ విషయంలో అదే జరిగింది.

Written By:
  • Shiva
  • , Updated On : June 3, 2023 5:13 pm
    Surender Reddy

    Surender Reddy

    Follow us on

    Surender Reddy: సినిమా అనేది జూదం. టాలీవుడ్ సక్సెస్ రేట్ జస్ట్ 2%. అంటే ప్రతి వంద సినిమాలకు ఆడేది రెండే. అయితే ఈ మధ్య బిజినెస్ లెక్కలు మారాయి. ఓటీటీ అనేది ఒకటి కొత్తగా చేరింది. గతంలో నిర్మాతకు థియేట్రికల్, శాటిలైట్స్ ద్వారా ప్రధాన ఆదాయం సమకూరేది. ఓటీటీతో కొంత మొత్తం అందుతుంది. నేరుగా ఓటీటీకి ఇచ్చేస్తే మరింత భారీ రేటు దక్కుతుంది. డిమాండ్ ఉన్న మీడియం బడ్జెట్ చిత్రాలను లాభాలు ఇచ్చి మరీ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ కొనుగోలు చేస్తున్నాయి. థియేటర్స్ లో విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంటే ఓటీటీలో రేటు పలకదు. ముందుగా ఒప్పందం చేసుకుంటే నిర్మాతకు ప్రయోజనం.

    భారీ బడ్జెట్ చిత్రాలు డిజాస్టర్ అయితే నిర్మాతలకు కష్టాలే. నష్టాలు చవిచూసిన బయ్యర్లు రోడ్లెక్కుతారు. ఈ మధ్య కాలంలో ఆచార్య, లైగర్ విషయంలో అదే జరిగింది. తాజాగా ఈ లిస్ట్ లో ఏజెంట్ వచ్చి చేరే సూచనలు కనిపిస్తున్నాయి. పాతిక కోట్ల వరకూ నష్టపోయిన బయ్యర్లు నిర్మాత అనిల్ సుంకర మీద ఒత్తిడి తెస్తున్నారట. ఎంతో కొంత తిరిగి చెల్లించాలని కోరుతున్నారట.

    అయితే ఈ పంచాయితీలో దర్శకుడు సురేందర్ రెడ్డి నలిగిపోయే అవకాశం కలదు. ఎందుకంటే ఏజెంట్ చిత్ర సహ నిర్మాతగా దర్శకుడు సురేందర్ రెడ్డి ఉన్నాడు. కాబట్టి ఆయన కూడా బయ్యర్ల నష్టాలు భరించాల్సి ఉంటుంది. అనిల్ సుంకర ఏజెంట్ మూవీతో దాదాపు రూ. 20 కోట్లు నష్టపోయామని చెబుతున్నారట. మరి అంత కోల్పోయిన అనిల్ సుంకర ఎంత తిరిగి ఇవ్వగలరు? అనేది ప్రశ్న. ఆయన ఇచ్చినా సురేందర్ రెడ్డి ఇస్తారా లేదా? అనే సందేహాలు మొదలయ్యాయి.

    నిర్మాణ భాగస్వామిగా ఉంది సురేందర్ రెడ్డి కూడా నష్టపోయారు. సాధారణంగా సురేందర్ రెడ్డి రెమ్యూనరేషన్ పది కోట్లకు పైనే ఉంది. ఏజెంట్ చిత్రానికి ఆయనకు ఆరు కోట్లు మాత్రమే మిగిలియాయట. రెండేళ్లుగా పైగా ఈ సినిమాకు సురేందర్ రెడ్డి పని చేస్తున్నారు. కాబట్టి ఆయనకు దగ్గర ఆరు కోట్లలో మిగిలింది ఎంతో చెప్పలేం. నిర్మాతగా మారిన సురేందర్ రెడ్డికి ఆర్థిక కష్టాలు తప్పేలా లేవని టాలీవుడ్ టాక్.