Sukumar Pushpa 3: పాన్ ఇండియా లెవెల్ లో డైరెక్టర్ సుకుమార్(Sukumar) పుష్ప సిరీస్ తో సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రాజమౌళి అప్పట్లో జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఒక మాట చెప్పాడు. సుకుమార్ మాస్ కమర్షియల్ మూవీ తీస్తే అతన్ని కొట్టేవాడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఎవ్వరూ లేరు, మేమంతా సర్దేసుకోవడమే అని అంటాడు. అది ‘పుష్ప’ చిత్రం తో దాదాపుగా రుజువు అయ్యినట్టే. గ్రాఫిక్స్ తో భారీ గ్రాండియర్ తో తెరకెక్కే సినిమాలు రాజ్యం ఏలుతున్న ఈరోజుల్లో ఒక కమర్షియల్ సినిమా 1800 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాబట్టింది అంటే అది సుకుమార్ టాలెంట్ కి నిదర్శనం అనే చెప్పాలి. అల్లు అర్జున్(Icon Star Allu Arjun) క్యారక్టర్ ని ఆయన మలిచిన తీరు సినిమా ఇండస్ట్రీ బ్రతికి ఉన్నన్ని రోజులు గుర్తు పెట్టుకుంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు.
అయితే ‘పుష్ప 2’ క్లైమాక్స్ తర్వాత ఒక విలన్ పుష్ప ని పుష్ప ఫ్యామిలీ మొత్తాన్ని పెళ్లి లో ఉండగా బాంబు పేల్చి చంపేస్తాడు. అప్పుడు ‘పుష్ప 3 – ది ర్యాంపేజ్’ అని టైటిల్ పడుతుంది. ఎదో అలా వెయ్యాలి కాబట్టి వేసి ఉంటారు, పుష్ప 3 వచ్చే అవకాశమే లేదు అని అంతా అనుకున్నారు. అయితే రీసెంట్ సైమా అవార్డ్స్ ఫంక్షన్ లో పాల్గొన్న సుకుమార్, పుష్ప 3 గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు. ఉత్తమ దర్శకుడు అవార్డు ని ‘పుష్ప 2’ చిత్రానికి గానూ అందుకున్న సుకుమార్, ‘పుష్ప 3 కచ్చితంగా ఉంటుంది’ అని మరోసారి క్లారిటీ ఇచ్చాడు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు కానీ. రామ్ చరణ్(Global Star Ram Charan) ఫ్యాన్స్ లో మాత్రం కాస్త భయం మొదలైంది. ఎందుకంటే ఈయన ఎక్కడ ‘పుష్ప 3′(Pushpa 3 Movie) మీద ఫుల్ ఫోకస్ పెట్టి, మా రామ్ చరణ్ తో చెయ్యబోయే సినిమాని పక్కన పెడుతాడో అని.
ప్రస్తుతం పెద్ది మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్న రామ్ చరణ్, ఈ సినిమా పూర్తి అయిన వెంటనే సుకుమార్ తో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. రీసెంట్ గానే సుకుమార్ తన టీం తో కలిసి స్క్రిప్ట్ వర్క్ ని కూడా మొదలు పెట్టేశాడు. వచ్చే ఏడాది లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. కానీ ఇంతలోపే సుకుమార్ పుష్ప 3 గురించి అలాంటి కామెంట్స్ చేయడం అభిమానుల్లో కాస్త గందరగోళం వాతావరణం ని క్రియేట్ చేసింది. ఇకపోతే రామ్ చరణ్ తో తీయబోయే సినిమా యాక్షన్ జానర్ లో ఉండబోతున్నట్టు సమాచారం. ‘రంగస్థలం’ చిత్రం తో రామ్ చరణ్ లోని అద్భుతమైన నటుడ్ని బయటకు తీసిన సుకుమార్, రాబోయే చిత్రం తో ఇంకెన్ని అద్భుతాలు క్రియేట్ చేస్తాడో చూడాలి.