Sukumar : టాలీవుడ్ లో క్రియేటివ్ ఆలోచనలతో సినిమాలు తెరకెక్కించి దర్శకులలో ఒకరు సుకుమార్. సుకుమార్ లాంటి డైరెక్టర్ మాస్ సినిమాలను తీస్తే, మా లాంటి డైరెక్టర్స్ ఇండస్ట్రీ లో బ్రతకలేరు అంటూ డైరెక్టర్ రాజమౌళి అనేక సందర్భాలలో చెప్పడం మనమంతా చూసాము. ‘రంగస్థలం’ చిత్రం తో అది రుజువు అయ్యింది. ‘పుష్ప’ సిరీస్ తో ఆయన మాస్ టేకింగ్ కి దేశం మొత్తం సలాం కొట్టింది. రాజమౌళి ఊరికే అలాంటి కామెంట్స్ చేయలేదు. సుకుమార్ లో ఈ రేంజ్ టాలెంట్ ఉంది కాబట్టే చేసాడు అంటూ సోషల్ మీడియా లో రాజమౌళి మాటలను గుర్తు చేసుకుంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఆయన డల్లాస్ లో అట్టహాసం గా జరిగిన రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యాడు. ఈ ఈవెంట్ లో ఆయన రామ్ చరణ్ గురించి, ‘గేమ్ చేంజర్’ గురించి మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి.
ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ఈ సినిమా నుండి ‘డోప్’ అనే లిరికల్ వీడియో సాంగ్ వచ్చిన సంగతి తెలిసిందే. ‘డోప్’ అంటే వదిలిపెట్టడం అని అర్థం. బెంగాలీ లో ఈ పదానికి ‘అబద్దం’ అనే అర్థం ఉంది. అయితే ఈ ఈవెంట్ లో సుమ సుకుమార్ ని ఒక ప్రశ్న అడుగుతూ ‘సుకుమార్ గారు..మీరు డోప్ అని చెప్పి దేనిని వదిలేయాలని అనుకుంటున్నారు’ అని అడుగుతుంది. దానికి సుకుమార్ సమాధానం చెప్తూ ‘సినిమా’ అనేస్తాడు. ఆయన చెప్పిన సమాధానం చూసి అందరూ షాక్ కి గురయ్యారు. సుకుమార్ సినిమాలను వదిలేయడం ఏమిటి?, కావాలనే ఆయన అలా అన్నాడా?, లేకపోతే సరదాగా అన్నాడా అని సోషల్ మీడియా లో అభిమానులు చర్చించుకుంటున్నారు. ‘డోప్’ అంటే బెంగాలీ లో అబద్దం అనే అర్థం కూడా వస్తుంది కాబట్టి, వదిలేయడం అబద్దం అనే ఉద్దేశ్యంతో చెప్పాడా అని విశ్లేషించుకుంటున్నారు అభిమానులు.
సుకుమార్ ఏ సమాధానం ఇచ్చినా చాలా లాజికల్ గా, తెలివి తేటలతో కూడినట్టుగా ఉంటుంది, దానిని డీ కోడ్ చేయడం కష్టమే, ప్రస్తుతానికి అయితే ఇలాగే అర్థం చేసుకుందాం. పుష్ప సిరీస్ తో ఇండస్ట్రీ ని షేక్ చేసిన డైరెక్టర్ సుకుమార్, తన తదుపరి చిత్రం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో చేయబోతున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ద్వితీయార్థం లో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. తనకి ‘రంగస్థలం’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన సుకుమార్ అంటే రామ్ చరణ్ కి ఎంతో ప్రత్యేకమైన అభిమానం. అందుకే తన కెరీర్ కి ఎంతో ముఖ్యమైన ‘గేమ్ చేంజర్’ మొదటి ఈవెంట్ కి తనతో పాటు తీసుకెళ్లాడు. సుకుమార్ కూడా ఈ ఈవెంట్ లో ఎంతో సంతోషంగా కనిపించి, నేను ఈ సినిమాని చూశానని, రామ్ చరణ్ కి నేషనల్ అవార్డుని తెచ్చిపెట్టే రేంజ్ సినిమా అవుతుందని చెప్పుకొచ్చాడు.
సుమ: సుకుమార్ గారూ.. మీరు ఒకవేళ DHOP అని చెప్పి దేన్ని వదిలేయాలనుకుంటున్నారు?
సుకుమార్ : సినిమా #RamCharan #GameChanager #Sukumar #Pushpa2TheRule #Pushpa2 #Newsof9 pic.twitter.com/64dfUkUyUr
— News Of 9 (@TheNewsof9) December 24, 2024