Rajamouli: బాహుబలి మూవీ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి రేంజ్ మారిపోయిందనే చెప్పాలి. అలానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా ఆయనకున్న ఫాలోయింగ్ చూస్తే అర్దం అవుతుంటుంది. అయితే వీరిద్దరి కాంబోలో ఒక మూవీ చేయాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. పలు సంధర్భాల్లో రాజమౌళి, పవన్ కూడా వారి మనసులోని మాటలను బయట పెట్టారు. అయితే తాజాగా పవర్ స్టార్ తో మూవీ గురించి రాజమౌళి పలు ఆసక్తికర వ్యాఖ్యలు సినివర్గాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది.
కాగా ఇటీవల శ్రీకాకుళంలోని ఓ కాలేజ్ ఫంక్షన్‌లో దర్శకుడు రాజమౌళి పాల్గొన్నారు. ఈ మేరకు విద్యార్దులు అడిగిన పలు ప్రశ్నలకు రాజమౌళి తఃనదైన శైలిలో బదులిచ్చారు. అయితే గతంలో ఓ సారి రాజమౌళి పవన్ తో సినిమా చేసేందుకు ప్రయత్నించారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్‌తో ఓ సినిమాను ప్లాన్ చేసిన రాజమౌళి ఏవో కారణాల వలన ప్రాజెక్ట్ ముందుకు పోలేదని అన్నారు. కొన్ని సంవత్సరాల కింద పవన్ కళ్యాణ్‌తో సినిమా కోసమని ఆయనకు కథ చెప్పాలనీ చూశానని… అయితే ఆ తర్వాత ఓ సంవత్సరం వరకు కూడా ఆయన నుంచి ఎటువంటి కాల్ రాకపోవడంతో నిరాశ చెందానని వాపోయారు.
ఆ తర్వాత తన ఆలోచన సరళిలో మార్పు రావడం కారణంగా వేరే సినిమాలు చేశానని తెలిపారు. అలానే నేను ఎక్కువ రోజులు సినిమాలను తీస్తానని… మరోవైపు పవన్ కూడా సినిమాల కంటే రాజకీయాల్లో ఎక్కువ మక్కువ చూపడంతో వీరి కాంబినేషన్ లో సినిమా చేయలేకపోయామని రాజమౌళి తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.