Director Shankar: మరో నాలుగు రోజుల్లో కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులు, సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన ‘దేవర’ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న గ్రాండ్ గా ప్లాన్ చేయగా, అది సెక్యూరిటీ కారణాల వల్ల క్యాన్సిల్ అవ్వడం అభిమానులను చాలా తీవ్రమైన నిరాశకు గురయ్యేలా చేసింది. కానీ ఎన్టీఆర్ మాత్రం ప్రొమోషన్స్ ద్వారా ఇంటర్వ్యూస్ తో ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తి కరమైన విషయాలను ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాడు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా నిన్ననే కర్ణాటక, చెన్నై వంటి ప్రాంతాల్లో మొదలైన సంగతి తెలిసిందే. కర్ణాటక ప్రాంతం లో జూనియర్ ఎన్టీఆర్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ ప్రాంతం బాక్స్ ఆఫీస్ పరంగా ఎన్టీఆర్ కి కంచుకోట అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి.
తనని ఎందుకు అలా పిలుస్తారో నిన్నటి అడ్వాన్స్ బుకింగ్స్ చూసిన తర్వాత అందరికీ అర్థం అయ్యింది. బుకింగ్స్ ప్రారంభించిన గంటలోపే దాదాపుగా కోటి రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఊపు చూస్తుంటే కేవలం కర్ణాటక నుండే పది కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టేలా ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ నెల రోజుల ముందే మొదలైన సంగతి తెలిసిందే. అక్కడ కేవలం నార్త్ అమెరికా నుండే ఈ సినిమాకి ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 1.6 మిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చాయి. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి ఇప్పుడు సరికొత్త తలనొప్పి మొదలైంది. ప్రముఖ డైరెక్టర్ శంకర్ ఈ చిత్రాన్ని ఉదేశిస్తూ పరోక్షంగా వేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో పెను దుమారం రేపుతోంది. ఆయన మాట్లాడుతూ ‘నేను ఒక నవల కి సంబంధించిన రైట్స్ ని కొనుగోలు చేసి సినిమాని తియ్యడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే ఈరోజే నేను ఒక కొత్త సినిమా ట్రైలర్ లో ఆ నవలకు సంబంధించిన సన్నివేశాలను తీసినట్టుగా గమనించాను. ఇది చాలా అన్యాయం, నేను దీనిపై లీగల్ గా చర్యలు తీసుకుంటాను. నా నవలలోని సన్నివేశాలను సినిమాల్లో, లేదా వెబ్ సిరీస్ లో వాడుకోవడం ఇకనైనా ఆపండి. లేకుంటే కఠిన చర్యలు తప్పవు’ అంటూ డైరెక్టర్ శంకర్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ ట్వీట్ ని ఆయన ‘దేవర’ రెండవ ట్రైలర్ విడుదలైన గంటకు వేసాడు.
దీనిని చూసి అందరూ దేవర గురించే ట్వీట్ వేసాడని అంటున్నారు. కొరటాల శివ సినిమాలకు కథ విషయాల్లో ఇలాంటి వివాదాలు కొత్తేమి కాదు. గతం లో శ్రీమంతుడు సినిమా స్టోరీ తన నుండి కొరటాల శివ దొంగలించాడని పెద్ద ఎత్తున ఆందోనళ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ‘ఆచార్య’ సినిమాకి కూడా ఇలాంటి వివాదం వస్తే, మళ్ళీ తలనొప్పి ఎందుకని అప్పటికప్పుడు స్టోరీ ని మార్చి సినిమాని తీసాడు, ఫలితం ఏమైందో అందరికీ తెలుసు. ఇప్పుడు ‘దేవర’ విషయం లో కూడా అదే సమస్య వచ్చింది, ఈ సమస్యని మూవీ టీం ఎలా ఎదురుకొని ముందుకు పోతుందో చూడాలి.
Attention to all ! As the copyright holder of Su. Venkatesan’s iconic Tamil novel “Veera Yuga Nayagan Vel Paari”, I’m disturbed to see key scenes being ripped off & used without permission in many movies. Really upset to see important key scene from the novel in a recent movie…
— Shankar Shanmugham (@shankarshanmugh) September 22, 2024
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read More