https://oktelugu.com/

Director RGV: అల్లు అర్జున్ ని ఆకాశానికి ఎత్తిన ఆర్జీవి… వాళ్ళు చేయలేనిది నువ్వు చేశావంటూ ?

Director RGV: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వర్మ ఎప్పుడు ఎవరి మీద ఎలా ట్వీట్ చేస్తాడో ఎవ్వరికి తెలీదు. గత వారం రోజుల నుంచి ఆర్జీవీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాడు. వార్తల్లో రోజూ కనిపిస్తున్నాడు. సినిమా టికెట్ల విధానంపై ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ట్వీట్స్ , వీడియోస్ చేస్తున్నాడు. గత మూడు రోజులుగా ట్విట్టర్లో ఇదే చర్చ జరిగింది. ఒక పక్క సినిమా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 6, 2022 / 01:42 PM IST
    Follow us on

    Director RGV: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వర్మ ఎప్పుడు ఎవరి మీద ఎలా ట్వీట్ చేస్తాడో ఎవ్వరికి తెలీదు. గత వారం రోజుల నుంచి ఆర్జీవీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాడు. వార్తల్లో రోజూ కనిపిస్తున్నాడు. సినిమా టికెట్ల విధానంపై ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ట్వీట్స్ , వీడియోస్ చేస్తున్నాడు. గత మూడు రోజులుగా ట్విట్టర్లో ఇదే చర్చ జరిగింది. ఒక పక్క సినిమా సమస్యల గురించి మాట్లాడుతూనే మరో పక్క సినిమాలని ప్రమోషన్స్ చేస్తున్నాడు.

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం పుష్ప. గత నెలలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతుంది. రిలీజ్ అయిన మొదటి రోజునే పాన్ ఇండియా భారీగా కలెక్షన్స్ రాబట్టింది. బన్నీ ఈ సినిమాతో సౌత్‏లోనే కాకుండా… నార్త్ లోనూ ఫాలోయింగ్ అందుకున్నాడు. ఈ మూవీ కలెక్షన్స్ సునామి సృష్టిస్తూ పాన్ ఇండియా లెవల్లో బన్నీ మేనియా చూపిస్తుంది. ఈ సినిమాపై పలువురు నటీనటులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

    https://twitter.com/RGVzoomin/status/1478712679145431041?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1478712679145431041%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2F10tv.in%2Fmovies%2Frgv-praise-allu-arjun-for-pushpa-movie-346898.html

    తాజాగా రామ్ గోపాల్ వర్మ కూడా తనదైన శైలిలో బన్నీని ప్రశంసించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ కూడా పెట్టారు. ఆ ట్వీట్ లో ” హేయ్ అల్లు అర్జున్, బాలీవుడ్ లో అంతిమ్, సత్యమేవ జయతే 2, 83 వంటి సినిమాలున్నా కూడా… వాటిని దాటుకుని పుష్పతో రీజనల్ సినిమాను నేషనల్ లెవల్‏కు తీసుకెళ్లావ్… కుడోస్ అని రాసుకొచ్చారు. ఇక హిందీలో ఇప్పటికే 60 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది పుష్ప. ఇక ఈ సినిమా ఓటీటీలో కూడా సందడి చేయనుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‎లో పుష్ప మూవీ జనవరి 7న స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.