Ram Gopal Varma: గతంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఫోటోలను మార్ఫింగ్ చేసి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై కేసు నమోదు అయ్యింది. ఈ క్రమంలో ఏపీ పోలీసులు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. ఆర్జీవీ విచారణకు రాకపోవడంతో అదుపులోకి తీసుకునేందుకు హైదరాబాద్ వచ్చారు. ఒంగోలు రూరల్ సీఐ తన సిబ్బందితో ఆర్జీవీ ఇంటికి రాగా హైడ్రామా చోటు చేసుకుంది. అయితే ఆర్జీవీ ఇంట్లో లేరని తెలిసింది. ఆయన కోసం గాలింపు చేపట్టారు.
ఆర్జీవీ వర్చువల్ గా విచారణకు హాజరు అవుతారని ఆయన తరపు లాయర్లు తెలియజేశారు. అయినప్పటికీ పోలీసులు సెర్చింగ్ కొనసాగించారు. ఆర్జీవీ భయపడి పారిపోయాడని మీడియాలో కథనాలు వస్తుండగా.. ఆయన వీడియో బైట్ విడుదల చేశారు. ప్రచారం అవుతున్నట్లు నేను పారిపోయలేదు. భయపడటం లేదు అన్నారు.
రామ్ గోపాల్ వర్మ సదరు వీడియోలో… నేనేదో వణికి పోతున్నాను, మంచం క్రింద దాక్కున్నాను అంటున్నారు. నాకు భయం లేదు పారిపోలేదు. ఎప్పుడో ఏడాది క్రితం పెట్టిన పోస్టుకి నాలుగు రోజుల వ్యవధిలో నాలుగు ప్రాంతాలకు చెందిన వ్యక్తుల మనోభావాలు ఒకేసారి దెబ్బతినడం ఏమిటీ? అసలు పోస్ట్ కి సంబంధించిన వాళ్ళ మనోభావాలు దెబ్బ తినలేదు. సంబంధం లేని వారి మనోభావాలు దెబ్బతిన్నాయి.
పోలీసులను రాజకీయనాయకులు ఆయుధాలుగా వాడుకుంటున్నారు. ఇది విదేశాల్లో కూడా జరుగుతుంది. అయితే న్యాయ వ్యవస్థ అనేది ఒకటి ఉంది. దాన్ని నేను నమ్ముతాను. నేను ఒక సినిమాకు పని చేస్తున్నాను. అందుకే హాజరు కాలేకపోయాను. కొంచెం సమయం అడిగాను. మధ్యలో నేను వస్తే ప్రొడ్యూసర్ నష్టపోతాడు. నా కేసు అంత ఎమర్జెన్సీ ఏంటి? మర్డర్ కేసుల కోసం నెలలు, సంవత్సరాలు తీసుకుంటున్నారు కదా.. అని వివరణ ఇచ్చాడు. వర్మ వీడియో వైరల్ అవుతుంది.
కాగా వర్మ గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్, పవర్ స్టార్ వంటి చిత్రాలు.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లకు వ్యతిరేకంగా చిత్రీకరించారు. వై ఎస్ జగన్ బయోపిక్ తెరకెక్కించిన వర్మ.. ఆ చిత్రాల్లో కూడా వారిని విలన్స్ గా చిత్రీకరించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. దాంతో వర్మ అరెస్ట్ కి రంగం సిద్ధమైంది.
నేను ఏడవడం లేదు… వణికిపోవడం లేదు
సంవత్సరం క్రితం నేను పెట్టిన ట్వీట్ కి, ఇప్పుడు నాలుగు చోట్ల నలుగురికి మనోభావాలు దెబ్బ తిన్నాయి..కేసు పెట్టారు.
సినిమా పనిలో ఉండడం వల్ల స్పందించడం కుదరలేదు.. నాకు వచ్చిన నోటీసులకు సమాధానం ఇచ్చాను : #RamGopalVarma#RGV #APPolice #CBN… pic.twitter.com/IQBIUjNZNH
— Sravani Journalist (@sravanijourno) November 26, 2024
Web Title: Director ram gopal varma responded to the notices of the prakasam district police
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com