Nandamuri Mokshagna-Prashanth Varma : కోట్లాది మంది నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన బాలయ్య వారసుడు మోక్షజ్ఞ తేజ మొదటి సినిమా ఎట్టకేలకు ఇటీవలే మొదలైంది. ఇంకా టైటిల్ ఖరారు అవ్వని ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని మోక్షజ్ఞ పుట్టినరోజు నాడు విడుదల చేసారు. ఈ ఫస్ట్ లుక్ లో ఎంతో స్టైలిష్ గా ఉన్నటువంటి నందమూరి వారసుడిని చూసి అభిమానులు ఎంతగానో మురిసిపోయారు. ఈ చిత్రానికి ‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించనున్నాడు. అయితే ఇది నిన్న మొన్నటి వార్త. ఇప్పుడు ప్రశాంత్ వర్మ ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నట్టు ఫిలిం నగర్ లో వినిపిస్తున్న వార్త. అందుకు కారణం ‘అన్ స్టాపబుల్ ‘ షో అని తెలుస్తుంది. ‘అన్ స్టాపబుల్’ షోకి, మోక్షజ్ఞ సినిమా ఆగిపోవడానికి లింక్ ఏంటి..?, అసలు ఏమి జరుగుతుంది అనేది ఇప్పుడు మనం ఈ స్టోరీ లో వివరంగా చూద్దాం.
ప్రశాంత్ వర్మ కెరీర్ ని ‘హనుమాన్’ కి ముందు, ‘హనుమాన్’ కి తర్వాత అని చెప్పొచ్చు. ఈ సినిమాకి ముందు ఆయన పలు సినిమాలు చేసాడు కానీ, అవి అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేదు. ఇండస్ట్రీ లో నెగ్గుకురావడానికి ప్రయత్నిస్తున్న రోజుల్లో ఆయనకీ ‘ఆహా’ మీడియా నుండి బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరించే ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ షో కి దర్శకత్వం వహించే అవకాశం దక్కింది. మొదటి మూడు సీజన్స్ కి ఆయనే దర్శకత్వం వహించాడు. ఆయన పనితీరుని నచ్చే బాలయ్య తన కొడుకు మొదటి సినిమా బాధ్యతలను అప్పగించాడు. అయితే ‘హనుమాన్’ తర్వాత ప్రశాంత్ వర్మ రేంజ్ బాగా పెరిగింది. రేంజ్ పెరిగినప్పుడు రెమ్యూనరేషన్ ని కూడా ఎక్కువ డిమాండ్ చేయడం సహజమే కదా. అందుకే ఆహా మీడియా ని ‘అన్ స్టాపబుల్’ సీజన్ 4 కి దర్శకత్వం వహించడానికి రెండు కోట్ల రూపాయిలు డిమాండ్ చేసాడు.
దీనికి ఆహా మీడియా సిద్ధంగా లేకపోవడంతో ప్రశాంత్ వర్మ ని పక్కన పెట్టేసారు. ఇక్కడే బాలయ్య, ప్రశాంత్ వర్మ మధ్య చిన్న గ్యాప్ ఏర్పడింది. ఆ గ్యాప్ ప్రభావం మోక్షజ్ఞ సినిమా మీద కూడా పడింది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడానికి ప్రశాంత్ వర్మ భారీ స్థాయిలో అడ్వాన్స్ రెమ్యూనరేషన్ కూడా తీసుకున్నాడు. కానీ ఇప్పుడు నేను దర్శకత్వం వహించలేను, కేవలం కథ, స్క్రీన్ ప్లే మాత్రమే ఇవ్వగలను అని అంటున్నాడట. ప్రశాంత్ వర్మ మాట్లాడిన మాటలపై తీవ్రమైన అసహనంపై గురైన బాలయ్య ఈ ప్రొజెక్ట్ ని క్యాన్సిల్ చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుసలు. మరి దీనిపై మూవీ టీం స్పందిస్తుందో లేదో చూడాలి. ఈ చిత్రంలో మోక్షజ్ఞతో పాటు బాలయ్య కూడా కీలక పాత్ర పోషించాల్సి ఉంది. మహాభారతం క్యారెక్టర్స్ ని లింక్ చేస్తూ ఈ చిత్రం స్టోరీ ఉంటుందట. అలా ఆసక్తికరమైన కథని సిద్ధం చేసిన ప్రశాంత్ వర్మ, ఇప్పుడు ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నాడు అంటూ వార్తలు రావడం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది.
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Director prashanth varma who took money for nandamuri mokshagnas first film and left it
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com