Director Maruthi Speech: ప్రభాస్(Rebel Star Prabhas) అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘రాజా సాబ్'(Rajasaab Movie) చిత్రం మరో 12 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కల్కి లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని ప్రభాస్ చేస్తున్న చిత్రమిది. అంతే కాదు ప్రభాస్ ఎంటర్టైన్మెంట్ జానర్ సినిమాలకు దూరమై దాదాపుగా పదేళ్లు దాటింది. మళ్లీ ఇప్పుడు ఆ జానర్ లో ఈ సినిమా చేస్తుండడం తో ఫ్యాన్స్ లోనే కాదు, మామూలు ఆడియన్స్ లో కూడా ఈ చిత్రం పై ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న హైదరాబాద్ లోని కూకట్ పల్లి ప్రాంతం లో ఘనంగా నిర్వహించారు. వేలాది మంది అభిమానుల సమక్ష్యం లో ఆ సినిమా డైరెక్టర్ మారుతీ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
మూడేళ్లు ఈ సినిమా కోసం పడిన కష్టం మొత్తం లోపల దాచుకున్నాడు. ఒక్కసారిగా సినిమా ఔట్పుట్ బాగా రావడం తో పాటు, ప్రభాస్ ని ఎదురు గా పెట్టుకొని మాట్లాడడం తో బాగా ఎమోషనల్ అయిపోయాడు. నాన్ స్టాప్ గా ఏడుస్తూ ఉండేలోపు క్రింద కూర్చున్న ప్రభాస్ స్టేజి మీదకు వచ్చి మారుతీ ని ఓదార్చడం హైలైట్ గా నిల్చింది. అభిమానుల సమక్ష్యం లో మారుతీ చాలా ఎమోషనల్ మూమెంట్స్ ని పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ ‘నిర్మాత విశ్వ ప్రసాద్ గారికి జీవితాంతం నేను రుణపడి ఉంటాను. ఎన్ని కష్టాలు వచ్చినా బలంగా నిలబడి ఈ సినిమాని నిలబెట్టాడు. ఎంత బడ్జెట్ అయినా లెక్క చేయలేదు. ఈ సినిమా కోసం ఆయన ప్రాణం పెట్టేసాడు. ఇక ప్రభాస్ గారితో నా అనుభవం గురించి చెప్పుకోవాలి. ఆదిపురుష్ సినిమా సమయం లో ఆయన రాముడు గెటప్ లో ఉన్నప్పుడు వెళ్లి ఈ మారుతీ కలిసాడు’.
‘చాలా సేపు మాట్లాడుకున్నాం. నేను ఆయన్ని ఆరోజు చాలా నవ్వించాను అనుకున్నాను. కానీ నాకు ఆయనతో సినిమా చేసే అవకాశం కల్పించాడు. సౌత్ ఆఫ్రికా లో ఒక మారుమూల గ్రామం లో షూటింగ్ కోసం వెళ్లాను నేను. అక్కడ జనాలకు నేను డైరెక్టర్ అని చేప్తే వింతగా చూసారు. ప్రభాస్ సినిమాకు డైరెక్టర్ అని చెప్తే, బాహుబలి ప్రభాస్ నా? అని అడిగారు. దేశం కానీ దేశం, మనకు పరిచయం లేని జాతికి కూడా ఆయన తెలుసు. అలాంటి నటుడు ఒక మీడియం రేంజ్ సినిమాలు తీసుకునే నాలాంటి డైరెక్టర్ కి అవకాశం ఇచ్చాడు. ఈ సినిమా రీ రికార్డింగ్ సమయం లో ఒక్కో రీల్ చూసుకొని నేను ఇంత గొప్ప సినిమా తీసినా అని అనుకున్నాను. మొదటి రీల్ లోనే ప్రభాస్ గారి నటన చూసి కన్నీళ్లు పెట్టేసుకున్నాను. అంత అద్భుతంగా నటించాడు ఆయన. ఈ సినిమాకు సంబంధించిన నా బాధ్యత పూర్తి అయ్యింది. ఒక్కటే చెప్తున్నాను, ఈ సినిమాని చూడండి. రెబెల్స్, ఫ్యామిలీ ఆడియన్స్, మూవీ లవర్స్, ప్రభాస్ ని ఇష్టపడే ఏ ఒక్కరిని కూడా ఈ సినిమా నిరాశపర్చదు. ఒకవేళ మీకు నచ్చకపోతే నా ఇంటి అడ్రస్ చెప్తున్నాను , విల్లా నెంబర్ 17 , కొల్లా లగ్జరీగా, కొండాపూర్..వచ్చేయండి’ అంటూ మారుతీ చాలా ఎమోషనల్ గా మాట్లాడాడు.
