Director Maruthi: నేడు రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘రాజా సాబ్'(Raja Saab Teaser) మూవీ టీజర్ ని విడుదల చేయగా ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిన రెస్పాన్స్ తెలిసిందే. ఈ టీజర్ ని ఒక భారీ ఈవెంట్ ని ఏర్పాటు చేసి విడుదల చేశారు. దేశం నలుమూలల నుండి ప్రతీ ఒక్క జర్నలిస్ట్ ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. అందుకోసం హైదరాబాద్ లోని పార్క్ హయాత్ హోటల్ లో వారం రోజుల క్రితమే 70 కి పైగా రూమ్స్ ని బుక్ చేశారు. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ మారుతీ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఈ చిత్రం లో హీరోయిన్స్ గా నిధి అగర్వాల్(Nidhi Aggarwal) , మాళవిక మోహనన్(Malavika Mohanan) నటించిన సంగతి తెలిసిందే. టీజర్ లో ఈ ఇద్దరు హీరోయిన్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.
ఈ ఇద్దరి హీరోయిన్స్ ని ఎలా ఎంపిక చేసుకున్నాము అనే విషయం గురించి డైరెక్టర్ మారుతీ(Maruthi) మాట్లాడుతూ ‘ప్రభాస్ గారు డార్లింగ్ ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ని పెట్టవా అని అడిగారు. ఎలాగో మన నిజ జీవితం లో హీరోయిన్ లేరు. ‘కల్కి’ చిత్రం లో హీరోయిన్ ఉన్నప్పటికీ కూడా మా మధ్య ఎలాంటి సన్నివేశాలు లేవు. ‘సలార్’ సినిమా చూస్తే అందులో హీరోయిన్ ఎప్పుడొస్తుందో, ఎప్పుడు వెళ్తుందో కూడా అర్థం కాలేదు. ఆదిపురుష్ చూస్తే సీత ని నాకు దూరం చేశారు. బొత్తిగా ఈమధ్య నా సినిమాల్లో హీరోయిన్స్ కి స్కోప్ లేకుండా పోయింది. కనీసం ఇద్దరు హీరోయిన్స్ ని అయినా పెట్టు అని అడిగారు. అప్పుడు నేను ప్రభాస్ గారి వైపు చూసి మీ రేంజ్ కి ఇద్దరు హీరోయిన్స్ ఏంటి సార్..ముగ్గురిని పెడతాను అని చెప్పాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
అదే విధంగా ఈ సినిమాకి దర్శకత్వం వహించే ఛాన్స్ ప్రభాస్ ఇచ్చిన సందర్భాన్ని డైరెక్టర్ మారుతీ గుర్తు చేసుకొని కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఆయన మాట్లాడుతూ ‘రాజా సాబ్ చిత్రానికి ముందు నాకు వరుసగా ఫ్లాప్స్ ఉన్నాయి. నా గత చిత్రం ‘పక్కా కమర్షియల్’ కూడా ఆడలేదు. దీంతో నాతో కమిట్మెంట్ ఇచ్చిన ఒక నిర్మాత కూడా నా నుండి దూరం వెళ్ళిపోయాడు. నాకు అప్పటికే ‘రాజా సాబ్’ అవకాశం వచ్చింది. ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ తో సినిమా అంటే ఆషామాషీ విషయం కాదు. మనం ఏమో ఫామ్ లో లేము, ఇలాంటి సమయంలో ప్రభాస్ గారితో సినిమా చేయడం కరెక్ట్ కాదని ప్రభాస్ కి ఈ ప్రాజెక్ట్ వద్దని చెప్పేందుకు సిద్దమయ్యాను. వంశీ కి కూడా ఈ విషయం చెప్పక ఓకే అన్నాడు. కానీ ప్రభాస్ అదే రోజు సాయంత్రం నాకు ఫోన్ చేసి నీ ఐడియా అద్భుతంగా ఉంది. మనం ఈ సినిమా చేస్తున్నాం అన్నాడు. ఆరోజు నాకు కన్నీళ్లు ఆగలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇంకా ఆయన ఏమి మాట్లాడాడో ఈ క్రింది వీడియో లో చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి.
“Lifeలో Heroines లేని #Prabhas గారు…
ఒక ఇద్దరినీ పెట్టగలవా Darling? అన్నారు…మీ రేంజ్కి ఇద్దరు ఏంటి, ముగ్గుర్ని పెడతా అన్నాను.”#TheRajaSaab pic.twitter.com/zURdAzWc5L
— Gulte (@GulteOfficial) June 16, 2025