Director Maruthi: 2012లో కొత్త వాళ్లతో ఈ రోజుల్లో అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు డైరెక్టర్ మారుతి. తొలి సినిమాతోనే సక్సెస్ సాధించి పాపులర్ అయ్యారు. ఆ తర్వాత ఏడాది ప్రేమ కథా చిత్రమ్ అనే హర్రర్ కామెడీతో బ్లాక్ బస్టర్ సాధించి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయారు. భలే భలే మగాడివోయ్, బాబు బంగారం వంటి సినిమాలు తీసి సక్సె్స్ సాధించి స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో రాజా సాబ్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. కామెడీ హారర్ జోనర్లో తెరకెక్కుతున్న ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కెరీర్లో తొలిసారి ప్రభాస్ ఆ జోనర్ మూవీ చేస్తుండడంతో అటు డార్లింగ్ అభిమానులు.. ఇటు సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే వేసవి కానుకగా ఏప్రిల్ 10న సినిమాను విడుదల చేస్తామని ఇప్పటికే మారుతి ప్రకటించారు.
కానీ ఇప్పుడు దసరా సందర్భంగా విడుదల చేయాలని చూస్తున్నట్లు సమాచారం. దసరాకు పోటీ ఉండడంతో సోలో డేట్ కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే విడుదల తేదీని అధికారికంగా అనౌన్స్ మెంట్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. అదే సమయంలో సినిమాలో కామెడీకి ఏ లోటు లేకుండా మారుతి షూటింగ్ నిర్వహిస్తున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. అందుకుగాను ఆనాటి దర్శకులు జంధ్యాల, ఈవీవీ రూట్లో మారుతి వెళ్తున్నారని తెలుస్తోంది. రాజా సాబ్ కోసం భారీ సంఖ్యలో కమెడియన్లను రంగంలోకి దించుతున్నారట. నిజానికి.. ఒకప్పుడు జంధ్యాల, ఈవీవీ సినిమాల్లో కమెడియన్లు బోలెడు మంది ఉండేవారు. ఆ విషయం అందరికీ తెలిసిందే.. స్క్రీన్ పై నవ్వుల పంట పండుతుంది. ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేసేవాళ్లు. అలా టాప్ కమెడియన్లు అంతా ఓ సినిమాలో కనిపించి చాలా కాలమైంది. దీంతో మళ్లీ ఎప్పుడు అలాంటి మూవీలు చూస్తామా అని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇప్పుడు మారుతి అలాంటి వారి నిరీక్షణకు తెర వేయనున్నారు. రాజా సాబ్ కోసం స్టార్ కమెడీయన్లు బ్రహ్మానందం, అలీతో పాటు వెన్నెల కిషోర్, సప్తగిరిని తీసుకున్నారు. కోలీవుడ్ నుంచి యోగిబాబు, వీటీ గణేష్ ను రంగంలోకి దించుతున్నారు మారుతి. వీరందరిపై తెరకెక్కించిన సీన్లు వేరె లెవల్ ఉంటాయని టాక్ వినిపిస్తుంది. దీంతో నెటిజన్లు డైరెక్టర్ మారుతి ట్రెండ్ సెట్ చేయబోతున్నారని కామెంట్స్ చేస్తున్నారు. సినిమా చూస్తున్నంతసేపు పొట్టలు చెక్కలయ్యే విధంగా నవ్వుకోవడం గ్యారంటీ అని అంటున్నారు.