Heroine Trisha: మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ ‘పొన్నియన్ సెల్వన్’ మొదటి భాగం గత ఏడాది విడుదలై ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం దాదాపుగా 500 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది. అలాంటి బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ నిన్న ప్రపంచవ్యాప్తంగా ఘానంగా అన్నీ బాషలలో విడుదలై పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది.
పార్ట్ 1 కంటే పార్ట్ 2 నే బాగుంది అనే టాక్ కూడా వినిపించింది. ఈ సినిమాలో ఎన్ని పాత్రలు ఉన్నా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న పాత్ర నందిని. విశ్వ సుందరి ఐశ్వర్య రాయ్ ఈ పాత్ర పోషించింది. ఈ పాత్ర సినిమాలో మెయిన్ విలన్ అనే విషయం తెలిసిందే.ఈ పాత్రని చెయ్యడానికి చాలా మంది హీరోయిన్లు పోటీ పడ్డారట.. అందులో త్రిష కూడా ఒకరు.
ఈ సినిమాలో త్రిష యువరాణి కుంధవై గా నటించిన సంగతి తెలిసిందే, అయితే మణిరత్నం త్రిష కి కథ చెప్పినప్పుడు ఆమె నందిని క్యారక్టర్ కావాలని కోరిందట.ఈ పాత్ర తనకి ఎంతగానో నచ్చిందని, దయచేసి ఆ పాత్ర నాకివ్వండి అని అడగగా మణిరత్నం ఆ పాత్రకి అప్పటికే ఐశ్వర్య రాయ్ ఖరారు అయిపోయింది, అగ్రిమెంట్ కూడా అయిపోయింది, ఇవ్వడం కుదరదు అని చెప్పాడట.దీనితో త్రిష నిరాశకి గురై యువరాణి కుంధవై పాత్ర పోషించింది.
ఈ పాత్ర కూడా తక్కువ ఏమి కాదు, నందిని పాత్రకి సరిసమానమైనది.కానీ త్రిష కి నెగటివ్ రోల్స్ చెయ్యడం అంటే ఇష్టం, అవకాశం వస్తే అలాంటి పాత్రలు చెయ్యడానికే మొగ్గు చూపిస్తాది, గతం లో ధనుష్ హీరో గా నటించిన ‘కొడి’ అనే తమిళ చిత్రం లో త్రిష నెగటివ్ రోల్ చేసింది, ఈ పాత్రలో అద్భుతంగా నటించినందుకు గాను ఆమెకి ఎన్నో అవార్డ్స్ కూడా వచ్చాయి.మళ్ళీ అలాంటి పాత్ర ఆమెకి ఎప్పుడు దక్కుతుందో చూడాలి.