Ks Sethu Madhavan: ప్రముఖ భారతీయ సినీ దర్శకుడు కేఎస్ సేతు మాధవన్ మరణించారు. వయసు మీద పడటంతో అనారోగ్యంతో బాధపుడుతున్న ఆయన.. 90 ఏళ్ల వయసులో శుక్రవారం ఉదయం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు ముగ్గురు పిల్లలు సంతానం. భారతీయ సినీ పరిశ్రమకు ఆయన చేసిన కృషికి గానూ, 10 జాతీయ చలనచిత్ర అవార్డులు, 9 కేరళరాష్ట్ర చలనచిత్ర అవార్డులు వరించాయి. ఈయన దర్శకత్వంలోనే 1962లో కన్నుమ్ కరాలుమ్ సినిమాతో కమల్హాసజ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయమయ్యారు. ఈ క్రమంలోనే మాధవన్ మృతికి సంతాపం తెలుపుతూ.. కమల్‌హాసన్ ట్వీట్ చేశారు.
காலத்தால் அழியாத காவியங்களைத் திரையில் படைத்த கே.எஸ்.சேதுமாதவன் புதிய அலை சினிமாவின் ஊற்றுமுகம்.மலையாள சினிமாவின் தரத்தைத் தீர்மானித்த அடிப்படை விசைகளுள் ஒருவர்.தன் கலைச்சாதனைகளால் என்றென்றும் நினைவு கூரப்படுவார்.என் சேது சாருக்கு, நல்ல சினிமாவை கற்பித்த ஆசிரியருக்கு அஞ்சலிகள். pic.twitter.com/CXPcyVuMDA
— Kamal Haasan (@ikamalhaasan) December 24, 2021
1931 మే 15న జన్మించిన సేతు మాధవన్.. తమిళ్, హిందీతో బాటు తెలుగులోను పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. జీవశాస్త్రంలో గ్యాడ్యుయేట్ పూర్తి చేసిన ఆయనకు.. మొదటి నుంచే సినిమాలంటే ఎంతో ఆసక్తి ఉండేది. ఈ క్రమంలోనే తొలుత అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ మొదలుపెట్టారు.
Also Read: మోర్ మసాలా మోర్ రొమాన్స్… విమర్శలు లెక్క చేయని నాగార్జున!
ఎల్వీ ప్రసాద్, ఏఎస్ఏ స్వామి, సుందర్ రావు, నందకర్ణి వంటి దర్శకులతో కలిసి పనిచేశారు. కెఎస్ సేతుమాధవన్ 1960లో తన మొదటి చిత్రం ‘సింఘాలీస్’లో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. KS సేతుమాధవన్ 1995 నుండి సినిమాలకు దూరంగా ఉంటున్నారు.ఇప్పటి వరకు ఆయన తన కెరీర్లో 60కిపైగా సినిమాలు తెరకెక్కించారు.
Also Read: విడుదలైన “అర్జున ఫల్గుణ ” ట్రైలర్…