https://oktelugu.com/

Director Krish : డైరెక్టర్ క్రిష్ రెండవ భార్య ని చూసారా..ఇంత అందం ఏంట్రా బాబు..హీరోయిన్స్ కూడా పనికిరారుగా!

పెళ్ళైన ఏడాదికే ఈ జంట కోర్టు లో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. వీళ్లిద్దరి విడాకుల పిటీషన్ ని పరిశీలించిన హై కోర్టు 2018 వ సంవత్సరంలో విడాకులు మంజూరు చేసింది. అప్పటి నుండి ఒంటరిగా ఉంటున్న క్రిష్ జీవితంలోకి గైనకాలజిస్ట్ ప్రీతీ వచ్చింది. ఈమెతో ఏర్పడిన పరిచయం కాస్త స్నేహంగా మారడం, ఆ స్నేహం ప్రేమగా మారి పెళ్లి పీటలు ఎక్కేలా చేయడం అన్నీ అలా జరిగిపోయాయి

Written By:
  • Vicky
  • , Updated On : November 9, 2024 / 01:46 PM IST

    Director Krish

    Follow us on

    Director Krish : ప్రముఖ దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ, అలియాస్ క్రిష్ త్వరలోనే రెండవ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ సోషల్ మీడియా లో గత రెండు రోజుల నుండి ప్రచారం అవుతున్న సంగతి తెలిసిందే. అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇప్పటికి రాకపోయినా , అనధికారికంగా మాత్రం పెళ్లి కూతురు ఎవరో కూడా తెలిసిపోయింది. హైదరాబాద్ కి చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ ప్రీతీ ని ఆయన ఈ నెల 10వ తారీఖున వివాహం చేసుకోబోతున్నట్టు తెలుస్తుంది. అదే విధంగా 16వ తేదీన ఆయన హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ చేసుకోనున్నాడు అట. ఈ రిసెప్షన్ వేడుకకు సినీ ప్రముఖులందరూ హాజరు అవుతారని తెలుస్తుంది. 2016 వ సంవత్సరం లో క్రిష్ రమ్య అనే డాక్టర్ తో గ్రాండ్ గా హైదరాబాద్ లో వివాహం చేసుకున్నాడు. ఈ వివాహ మహోత్సవానికి సినీ ప్రముఖులు కూడా విచ్చేసిన సంగతి తెలిసిందే.

    అయితే పెళ్ళైన ఏడాదికే ఈ జంట కోర్టు లో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. వీళ్లిద్దరి విడాకుల పిటీషన్ ని పరిశీలించిన హై కోర్టు 2018 వ సంవత్సరంలో విడాకులు మంజూరు చేసింది. అప్పటి నుండి ఒంటరిగా ఉంటున్న క్రిష్ జీవితంలోకి గైనకాలజిస్ట్ ప్రీతీ వచ్చింది. ఈమెతో ఏర్పడిన పరిచయం కాస్త స్నేహంగా మారడం, ఆ స్నేహం ప్రేమగా మారి పెళ్లి పీటలు ఎక్కేలా చేయడం అన్నీ అలా జరిగిపోయాయి. అయితే తన మాజీ భార్య, కాబోయే భార్య ఇద్దరు కూడా వైద్య వృత్తికి చెందిన వాళ్ళు అవ్వడం గమనార్హం. సాధారణంగా సినీ ఇండస్ట్రీ చెందిన వాళ్ళు, ఇండస్ట్రీ లో ఉన్నవాళ్ళతో పరిచయం ఏర్పర్చుకోవడం, ఆ తర్వాత వాళ్ళ మధ్య రిలేషన్ బాగుంటే ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడం వంటివి జరుగుతుంటాయి. కానీ క్రిష్ విషయంలో మాత్రం పూర్తిగా భిన్నం. తానూ గతంలో పెళ్లి చేసుకున్న అమ్మాయి , త్వరలో పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి ఇద్దరూ కూడా తన వృత్తికి సంబంధం లేని వాళ్ళే అవ్వడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.

    ఇక క్రిష్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ తో గత మూడేళ్ళుగా చేస్తున్న ‘హరి హర వీరమల్లు’ మూవీ నుండి తప్పుకొని, అనుష్క సినిమాకి షిఫ్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభం లో ఈ సినిమా షూటింగ్ ని మొదలు పెట్టిన క్రిష్, ఇప్పుడు చివరి దశకి తీసుకొచ్చాడు. ‘ఘాటీ’ అనే టైటిల్ తో తెరకెక్కించిన ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని రీసెంట్ గానే విడుదల చేయగా, దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అనుష్క ని ఇప్పటి వరకు ఎవ్వరూ చూపించినంత క్రూరంగా ఈ సినిమాలో చూపించినట్టు గ్లిమ్స్ వీడియో ని చూస్తేనే అర్థం అవుతుంది. తెలుగు తో పాటు, ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి, లేదా మార్చి నెలలో విడుదల కాబోతుంది. అదే విధంగా ఆయన 90 శాతం తెరకెక్కించిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం మార్చి 28వ తారీఖున విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.