Ustad Bhagat Singh: బ్రో మూవీలో శ్యామ్ బాబు పాత్ర వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. 30 ఇయర్స్ పృథ్వి ఈ శ్యామ్ బాబు రోల్ చేశారు. ఆయన డాన్స్ చేస్తుంటే పవన్ కళ్యాణ్ నాన్ సింక్ డాన్స్ అంటూ తిడతాడు. మొదటి రోజే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ సన్నివేశాన్ని మొబైల్స్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. ఏపీ మంత్రి అంబటి రాంబాబు సంక్రాంతి వేడుకల్లో డాన్స్ చేసిన నేపథ్యంలో దాని మీద సెటైరికల్ గా శ్యామ్ బాబు అనే పాత్రను పెట్టారనేది వైసీపీ వర్గాల వాదన. దీనిపై మంత్రి రాంబాబు నేరుగా స్పందించారు.
ఆయన ఏకంగా బ్రో మూవీ పెట్టుబడుల విషయంలో మనీ లాండరింగ్ జరిగింది. పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ ఎంతో చెప్పాలి. సినిమా బడ్జెట్ లెక్కలు విప్పాలి అన్నారు. ఢిల్లీ వెళ్లి బ్రో మూవీ లావాదేవీల మీద ఈడీకి పిర్యాదు చేశారు. ఒక చిన్న రిఫరెన్స్ కే ఇంత హడావుడి జరిగిన నేపథ్యంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో భారీగా పొలిటికల్ సెటైర్స్ ఉంటాయని సమాచారం. దర్శకుడు హరీష్ శంకర్ పవర్ ఫుల్ వన్ లైనర్స్ రాయడంలో దిట్ట. కాబట్టి ఉస్తాద్ మూవీ ఎంత వివాదం అవుతుందో… అని ఒక మీడియా సంస్థ ట్వీట్ చేసింది.
ఈ ట్వీట్ కి దర్శకుడు హరీష్ శంకర్ స్పందించడం విశేషం. సదరు ట్వీట్ ట్యాగ్ చేసి పవన్ కళ్యాణ్ ఐకానిక్ మేనరిజం వీడియో షేర్ చేశారు. అంటే తగ్గేదే లేదు. ఆ కోణంలో పవర్ ఫుల్ డైలాగ్స్, పొలిటికల్ సెటైర్స్ ఉంటాయని పరోక్షంగా ఒప్పుకున్నాడు. సో… ఉస్తాద్ భగత్ సింగ్ తో పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని, వైఎస్ జగన్, వైసీపీ నాయకులను తీవ్ర స్థాయిలో దుయ్యబట్టడం ఖాయం అంటున్నారు.
ఉస్తాద్ భగత్ సింగ్ కథకు ఆ స్కోప్ ఉన్న క్రమంలో ఎన్నికలకు ముందే విడుదల చేయాలని గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలే హరీష్ శంకర్ కి పవన్ కళ్యాణ్ సూచనలు చేసినట్లు సమాచారం. వరుస షెడ్యూల్స్ లో మూవీ పూర్తి చేసి సంక్రాంతి విడుదలకు సిద్ధం చేయాలని అన్నారట. ఎన్నికల తర్వాత 2024లో చేద్దామనుకుని పక్కన పెట్టిన ఉస్తాద్ ని తెరపైకి తెచ్చారట. ఇటీవల ఈ ప్రాజెక్ట్ అసలు ఆగిపోయిందని కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.
https://t.co/1jnnBn5dkt pic.twitter.com/mAYTBj9l7b
— Harish Shankar .S (@harish2you) August 5, 2023