Harish Rao :ప్రస్తుతం నడుస్తున్న పాన్ ఇండియా ట్రెండ్ లో కమర్షియల్ సినిమాలు ఆడియన్స్ కి నచ్చే విధంగా తీసే ఇద్దరు ముగ్గురు దర్శకులు ఉన్నారు, వారిలో డైరెక్టర్ హరీష్ శంకర్(Harish Shankar) కూడా ఒకడు. ‘మిరపకాయ్’, ‘గబ్బర్ సింగ్’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’, ‘గద్దల కొండ గణేష్’ వంటి సూపర్ హిట్ సినిమాలు చేసిన హరీష్ శంకర్, రీసెంట్ గానే రవితేజ తో ‘మిస్టర్ బచ్చన్’ అనే చిత్రాన్ని చేసి భారీ ఫ్లాప్ ని అందుకున్నాడు. మరోవైపు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తో ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagathsingh) చిత్రాన్ని మొదలు పెట్టి, ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో బిజీ అవ్వడం వల్ల తాత్కాలికంగా పక్కన పెట్టాడు. మళ్ళీ ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలు అవుతుంది అనేది డైరెక్టర్ హరీష్ శంకర్ కి కూడా క్లారిటీ లేదు. అందుకే ఆ సినిమా మొదలయ్యే లోపు మరో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.
రీసెంట్ గానే ఆయన నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ని కలిసి ఒక పవర్ ఫుల్ స్టోరీ ని వినిపించాడట. స్టోరీ లైన్ బాలయ్య బాబు కి తెగ నచ్చేసిందట. ‘అఖండ 2’ పూర్తి అవ్వగానే ఈ సినిమా చేద్దామని చెప్పాడట. అఖండ 2 మూవీ షూటింగ్ పూర్తి అవ్వడానికి ఆగస్టు నెల వరకు సమయం పట్టొచ్చు. కాస్త అటు ఇటు అయితే ఈ ఏడాది మొత్తం ఈ షూటింగ్ కోసమే సమయం కేటాయించిన ఆశ్చర్యపోనక్కర్లేదు. అప్పటి వరకు హరీష్ శంకర్ ఖాళీగా ఉండాల్సిందేనా?, లేదా ఈలోపు పర కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాన్ని పూర్తి చేయడానికి డేట్స్ ఇస్తాడా అనేది తెలియాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ తన ఫోకస్ మొత్తం ప్రధానంగా ‘హరి హర వీరమల్లు’, ‘ఓజీ’ చిత్రాల మీదనే ఉంచాడు. ఈ రెండు సినిమాల షూటింగ్స్ చివరి దశలో ఉన్నాయి. ‘హరి హర వీరమల్లు’ కి కేవలం నాలుగు రోజుల డేట్స్ ఇస్తే సరిపోతుంది.
కానీ పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు డేట్స్ ఇవ్వకుండా నిర్మాతలను ఇబ్బంది పెడుతున్నాడు. షూటింగ్ పూర్తి అవ్వడానికి దగ్గరగా ఉన్న సినిమాలకే ఆయన ఇంత చేస్తుంటే, ఇక ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం ఏమి పూర్తి చేస్తాడు?, అసలు ఈ సినిమా ఉంది అనే విషయమే మర్చిపోయే పరిస్థితి ఉందట. అలా ఉంది ప్రస్తుతం. కాబట్టి ఇక నుండి డైరెక్టర్ హరీష్ శంకర్ కేవలం బాలయ్య సినిమా మీదనే ఫోకస్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని ఎవరు నిర్మించబోతున్నారు?, నటీనటుల వివరాలు ఏమిటి అనేది త్వరలోనే తెలియనుంది. ‘గబ్బర్ సింగ్’ చిత్రం తర్వాత ఎక్కడికో వెళ్ళిపోతాడని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా అనుకున్నారు. కానీ హరీష్ శంకర్ ఇంకా గబ్బర్ సింగ్ దగ్గరే ఆగిపోయాడు. రీమేక్ సినిమాలు తప్ప, ఒరిజినల్ స్టోరీస్ ని సమర్ధవతంగా తీసే సత్తా లేదని హరీష్ శంకర్ కి ఒక చెడ్డ పేరుంది, ఆ పేరుని చెరిపేసుకుంటాడా లేదా అనేది చూడాలి.