Bobby Chiranjeevi movie latest update: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలకు మంచి గుర్తింపైతే ఉంది. ముఖ్యంగా కొంతమంది కమర్షియల్ డైరెక్టర్లు చేసే సినిమాల విషయంలో చాలా క్లారిటీని మెయింటైన్ చేస్తుంటారు. రొటీన్ రెగ్యూలర్ ఫార్మాట్లో సినిమాలను చేసి సక్సెస్ ని సాధించడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని… కానీ కొంతమంది డైరెక్టర్స్ కమర్షియల్ సినిమాల్లో మాత్రం డిఫరెంట్ ఎలివేషన్స్ ను, ఎమోషన్స్ ని వాడుతూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. దర్శకుడు సైతం ‘వాల్తేరు వీరయ్య’, ‘డాకూ మహారాజు’ లాంటి సినిమాలతో భారీ సక్సెస్ లను సాధించాడు. ఇప్పుడు చిరంజీవితో మరోసారి ఒక మాస్ సినిమా చేయబోతున్నాడు. ముఖ్యంగా బీ,సీ సెంటర్ ప్రేక్షకులను టార్గెట్ చేసుకొని ఈ సినిమాలైతే చేస్తున్నారట.
తను అనుకున్నట్టుగానే ఈ సినిమాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి ప్రేక్షకుల నుంచి ఒక భారీ రెస్పాన్స్ రాబట్టగలుగుతాయా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు బాబీ చేసిన సినిమాలన్నీ కూడా సగటు ప్రేక్షకులను మెప్పించాయి. చిరంజీవితో చేస్తున్న ఈ సినిమా సైతం ప్రేక్షకుడిని విపరీతంగా ఆకట్టుకుంటుందనే వార్తలైతే వస్తున్నాయి. ఇక అన్ని బాగున్నాయి కానీ ఈ సినిమాలో చిరంజీవి ఒక అమ్మాయికి తండ్రిగా నటిస్తున్నాడు.
Also Read: ఎన్టీఆర్ ఆ సినిమా చేసి ఉంటే ఇండస్ట్రీ హిట్ వచ్చేదా..?
దాదాపు 50 సంవత్సరాల పైబడిన వయసు గల క్యారెక్టర్ ని పోషిస్తున్నాడు. ఇక అలాంటి పాత్ర చిరంజీవికి ఎలా సెట్ అవుతుంది. గతంలో బాలయ్య బాబు చేసిన ‘భగవంత్ కేసరి’ సినిమాలో తను పర్ఫెక్ట్ గా ఆ పాత్రనైతే పోట్రే చేయగలిగాడు. ఇక చిరంజీవి సైతం ఆ పాత్రను పర్ఫెక్ట్ గా చేయగలుగుతాడా? చిరంజీవి కూతురు క్యారెక్టర్ లో మరొక నటి నటిస్తుంది.
ఆమె ఎంతవరకు ఆ పాత్రకి సెట్ అవుతుంది. చిరంజీవి ఆ పాత్రని ఓన్ చేసుకొని చేయగలుగుతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమా అన్నివేళలా బాగున్నప్పటికి చిరంజీవికి 20 సంవత్సరాల కూతురు ఉంది అనే విషయాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది తెలియాల్సి ఉంది. మొత్తానికైతే సినిమా మొత్తానికి ఇది ఒకటే మైనస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి…