Balakrishna Director: చాలామంది స్టార్ హీరోలు వాళ్ళు చేసే సినిమాలతో ఇండస్ట్రీ హిట్లను సాధించాలని చూస్తారు. అది అన్నివేళల వర్కౌట్ కాదు. కానీ కొంతమంది దర్శకులు ఆ హీరోకి సెట్ అయ్యే సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను సాధించినప్పుడు మాత్రం అది ఈజీగా ఇండస్ట్రీ హిట్ గా కన్వె అవుతోంది. బాలకృష్ణ హీరోగా వచ్చిన చాలా సినిమాలు సూపర్ సక్సెస్ ని సాధించాయి. అందులో బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు అనే సినిమాలు ఇండస్ట్రీ హిట్లుగా మారాయి. ఇక బాలయ్య బాబు లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసిన బి గోపాల్ యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా తన తను ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత చిరంజీవితో ఇంద్ర సినిమా చేసి టాప్ పొజిషన్ కి వెళ్ళాడు. మొత్తానికైతే ఆయన మాస్ పల్స్ తెలిసిన దర్శకుడిగా తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్నాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే బాలయ్య బాబుతో చేసిన ‘పల్నాటి బ్రహ్మనాయుడు’ అనే సినిమాతో ఆయన ఒక్కసారిగా తన మార్కెట్ మొత్తాన్ని కోల్పోయి డౌన్ ఫాల్ అయిపోయాడు. అప్పటినుంచి ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలు చేసినప్పటికి అవి పెద్దగా ఆడక పోవడంతో ఆయన మార్కెట్ మొత్తం క్లోజ్ అయిపోయింది. ప్రస్తుతం ఆయన ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోయాడనే చెప్పాలి.
బాలయ్య బాబుతో చేసిన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాలతో విజయాలను సాధించిన ఆయన అదే బాలయ్య బాబుతో చేసిన పల్నాటి బ్రహ్మనాయుడు సినిమాతో మార్కెట్ ను కోల్పోయి ఫెడౌట్ అయిపోవడం అనేది ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నిజానికి బి.గోపాల్ అంటే మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. అలాంటి దర్శకుడు సడన్ గా ఫేడ్ అవుట్ అయిపోవడం వెనక కారణమేంటి? అనేది కూడా తెలియాల్సి ఉంది.
బాలయ్య బాబుతో చేసిన పల్నాటి బ్రహ్మనాయుడు సినిమాలో కొన్ని ఓవర్ సీన్స్ ఉండడం ఆయన భారీ విమర్శలను మూట గట్టుకున్నాడు. అందుకే అతనితో సినిమాలు చేయడానికి ఎవరు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో అతని పతనం అనేది స్టార్ట్ అయిందనే చెప్పాలి…ఫైనల్ గా తను ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయిపోయాడు…