Director AS Ravikumar
Director AS Ravikumar: దర్శకుడు ఏ ఎస్ రవికుమార్ చౌదరి చేసిన పని హాట్ టాపిక్ అయ్యింది. ప్రెస్ మీట్లో ఆయన హీరోయిన్ మన్నారా చోప్రాకు ముద్దు పెట్టాడు. దీనిపై కొందరు మండిపడుతున్నారు. పబ్లిక్ లో ఇలాంటి వెకిలి చేష్టలు ఏంటని తిట్టిపోస్తున్నారు. రవి కుమార్ చౌదరి చాలా కాలం అనంతరం రాజ్ తరుణ్ తో ఓ చిత్రం చేస్తున్నాడు. ‘తిరగబడరా సామీ’ ఈ చిత్ర టైటిల్. చిత్ర టీజర్ విడుదల చేశారు. రాజ్ తరుణ్ కి జంటగా మాల్వి మల్హోత్రా నటిస్తుంది.
టీజర్ విడుదల నేపథ్యంలో యూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. తిరగబడరా సామీ చిత్రంలో మన్నారా చోప్రా ఓ రోల్ చేశారు. ఆమె కూడా ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. మన్నారా చోప్రాతో సన్నిహితంగా ఫోటోలకు ఫోజులిచ్చిన రవి కుమార్ చౌదరి ఆమె బుగ్గపై ముద్దు పెట్టాడు. ఊహించని పరిణామంతో ప్రెస్ తో పాటు మన్నారా షాక్ అయ్యింది. పబ్లిక్ కావడంతో ఆమె జస్ట్ నవ్వేసి ఊరుకున్నారు.
దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. అదే సమయంలో ఇది పబ్లిసిటీ స్టంట్ కూడా కావొచ్చని అంటున్నారు. చిన్న చిత్రాలకు ప్రచారం కల్పించుకోవడం కోసం ఈ మధ్య ఇలాంటి సెన్సేషన్స్ చేయడం ఎక్కువైపోయింది. హీరోయిన్ కి దర్శకుడు ముద్దు పెడితే అది హాట్ టాపిక్. ఉచితంగా పలు వెబ్ సైట్స్ ఈ విషయం గురించి రాస్తాయి. ఆటోమేటిక్ గా చిత్రానికి పబ్లిసిటీ దక్కుతుంది. ఇక గతంలో కూడా రవికుమార్ చౌదరి కొన్ని ఆరోపణలు ఎదుర్కొన్నారు.
బాలకృష్ణ నటించిన వీరభద్ర సినిమాకు రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించారు. ఈ మూవీ నిర్మాత అంబికా కృష్ణ ఆ మధ్య రవికుమార్ చౌదరిపై ఆరోపణలు చేశాడు. తాగి సెట్స్ కి వచ్చేవాడిని, సినిమా తనకు ఇష్టం వచ్చినట్లు తీసి బడ్జెట్ పెంచేశాడని అన్నారు. అంబికా కృష్ణ ఆరోపణలను రవికుమార్ చౌదరి ఖండించారు. బాలకృష్ణ వంటి పెద్ద హీరో సినిమా షూటింగ్ కి తాగి వచ్చే ధైర్యం ఉంటుందా? ఆయన ఊరుకుంటారా?… ఆయనవన్నీ అవాస్తవాలు అని కొట్టిపారేశారు. యజ్ఞం వంటి హిట్ మూవీకి దర్శకత్వం వహించిన రవికుమార్ చౌదరి ఆటాడిస్తా, పిల్ల నువ్వు లేని జీవితం చిత్రాలను తెరకెక్కించారు.
#PriyankaChopra’s cousin, actress #Mannarachopra gets kissed by director AS Ravikumar in front of the media! 🤦🏼♂️#TiragabadaraSaamipic.twitter.com/54w5JHvjIv
— Ajay AJ (@AjayTweets07) August 29, 2023