
హాట్ హీరోయిన్ కంగనా తిట్లకు గట్టిగా జవాబు ఇచ్చేందుకు బాలీవుడ్ స్టార్స్ కూడా భయపడుతున్న ఈ టైంలో ఒక యువ హీరో కంగనా పై విమర్శలు చేస్తున్నాడు. కంగనా పెద్ద అబద్దాలకోరుగా నిలపడంలో ఆ కుర్ర హీరో బాగానే సక్సెస్ అయ్యాడు. ఇంతకీ ఆ యువ హీరో ఎవరు అంటే.. పంజాబ్ కి చెందిన ధిల్జిత్. బాలీవుడ్ లో కూడా “గుడ్ న్యూజ్”, “ఉడ్తా పంజాబ్” వంటి సినిమాల్లో ఈ కుర్రాడు నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక బీజేపీ తరపున వకాల్తా పుచ్చుకొని…అందరిని సోషల్ మీడియా వేదిక పై విమర్శలు గుప్పించే కంగనా తాజాగా పంజాబ్ రైతుల నిరసన దీక్షపై కూడా తనదైన కామెంట్స్ చేయడంతో.. కంగనా పై ట్విట్టర్ లో ధిల్జిత్ ఓ రేంజులో విరుచుకుపడ్డాడు.
Also Read: మెగాస్టార్ కోసం ప్రత్యేక సెట్.. సాంగ్స్ ను కూడా.. !
అయితే ఈ కుర్ర హీరో ఇంతగా విరుచుకుపడటానికి కారణం.. ఒక ముసలి ఆవిడ వీడియోని పోస్ట్ చేస్తూ… ఈవిడ ఇంతకుముందు ఢిల్లీ గొడవల్లో కూడా పాల్గొంది అంటూ కంగనా పోస్ట్ చేసింది. ఈమె ఇప్పుడు రైతు వేషం వేసింది అనే సెన్స్ లో కంగనా కామెంట్ చేసింది. దాంతో ధిల్జిత్ కంగనా అబద్దం ఆడుతోందని, ఆమె అసలైన పంజాబీ రైతు కుటుంబానికి చెందిన ఆవిడే అని ప్రూవ్ చేసే ఒక వీడియో ఇంటర్వ్యూ ని షేర్ చేశాడు. దాంతో కంగనా ఆ కుర్ర హీరోని “నోరుమూసుకో. నువ్వు కరణ్ జోహార్ చెంచా” అన్నట్లుగా పోస్ట్ పెట్టింది. దాంతో ధిల్జిత్ కూడా పంజాబీ భాషలో కంగనాకి గట్టిగా సమాధానం ఇచ్చాడు.
Also Read: ఆ యంగ్ డైరెక్టర్ కు మహేష్ చాన్స్?
ధిల్జిత్ కంగనాను ఉద్దేశించి పోస్ట్ చేస్తూ.. ‘ఇండియా నీదొక్కదానిదే కాదు. మాది కూడా. నీకు సంబంధంలేని విషయాల్లో కూడా తగుదునమ్మా అంటూ అన్నిటికి రెడీ అవుతావు. నీ అసలు రంగు మా అందరికి తెలుసు. నువ్వు 2 పోస్టులు పెడితే 36 మంది రెస్పొండ్ అవుతారేమో. నువ్వు రెండు మాటలు అంటే… మేము 36 సమాధానాలు ఇవ్వగలం…,” అంటూ వరుస ట్వీట్లతో కంగనా పై పరుషంగా కామెంట్స్ పెట్టాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం బాలీవుడ్ న్యూస్