https://oktelugu.com/

Rowdy Boys Movie: మొన్న ఎన్టీఆర్, నిన్న బన్నీ, నేడు ప్రభాస్.. ఎవర్నీ వదట్లేదుగా !

Rowdy Boys Movie: ‘దిల్‌’ రాజు తన తమ్ముడు శిరీష్‌ తనయుడు ఆశిష్‌ కోసం తనకున్న పరిచయాలన్నీ ఫుల్ గా వాడేస్తున్నాడు. ఎన్టీఆర్ దగ్గర నుంచి మొదలు పెడితే.. బన్నీ మీదుగా ప్రయాణం చేసి ప్రస్తుతం ప్రభాస్ దగ్గరకు వచ్చి ఆగాడు. ఆశిష్‌ ‘రౌడీ బాయ్స్‌’ అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయం కాబోతున్నాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 14వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను […]

Written By: , Updated On : January 12, 2022 / 12:31 PM IST
Follow us on

Rowdy Boys Movie: ‘దిల్‌’ రాజు తన తమ్ముడు శిరీష్‌ తనయుడు ఆశిష్‌ కోసం తనకున్న పరిచయాలన్నీ ఫుల్ గా వాడేస్తున్నాడు. ఎన్టీఆర్ దగ్గర నుంచి మొదలు పెడితే.. బన్నీ మీదుగా ప్రయాణం చేసి ప్రస్తుతం ప్రభాస్ దగ్గరకు వచ్చి ఆగాడు. ఆశిష్‌ ‘రౌడీ బాయ్స్‌’ అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయం కాబోతున్నాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 14వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఫుల్ గా ప్రమోట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

Rowdy Boys Movie

Rowdy Boys Movie

అలాగే ఈ సినిమాలోని ‘డైట్‌ నైట్‌’అనే సాంగ్ ను అల్లు అర్జున్‌ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ సినిమాలోని ఫ్రెండ్‌షిప్‌ అనే సాంగ్‌ ను పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ‘యే జిందగీ’అంటూ సాగే ఈ సాంగ్ లో స్నేహ బంధానికి సంబంధించిన గొప్పతనాన్ని తెలియ జేస్తూ రచయిత కృష్ణకాంత్‌ ఈ పాటను చాలా చక్కగా రాశాడు. లిరిక్స్‌ కూడా చాలా బాగున్నాయి.

అలాగే రామ్‌ మిర్యాల ఈ పాటను చాలా అద్భుతంగా ఆలపించాడు. ఇక ఈ సినిమాలోని మరో రెండు సాంగ్స్ ను కూడా ఈ రోజే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 2 గంటలకు ఒక పాటను, అలాగే 5 గంటలకు మరో పాటను రిలీజ్ చేస్తారట. పైగా ఈ రోజు సాయంత్రం 6 గంటలకు “రౌడీ బాయ్స్” మ్యూజికల్ ఈవెంట్ ను గ్రాండ్ గా చేయబోతున్నారు. మొత్తమ్మీద దిల్ రాజు తన తమ్ముడు తనయుడు శిరీష్‌ కోసం బాగానే కష్టపడుతున్నాడు.

Also Read:  ఆ హీరో సినిమాను టార్గెట్ చేసిన ‘రౌడీ బాయ్స్’..!

దిల్ రాజు సహజంగా వేరే హీరోల కథలపైనే సంవత్సరాలు పాటు వర్క్ చేయించి సినిమాలు తీస్తాడు. మరి తన తమ్ముడు కుమారుడి కోసం ఇక దిల్ రాజు ఎంతగా కసరత్తులు చేసి ఉంటాడు ? అందుకే, ఏకంగా మూడు ఏళ్ళు స్క్రిప్ట్ వర్క్ చేయించి ఈ సినిమాని తీశాడట. కాగా అశిష్‌ రెడ్డి హీరోగా వస్తున్న ఈ ‘రౌడీ బాయ్స్‌’లో అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌ గా నటించింది.

అలాగే హర్ష కొనుగంటి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఎలా ఉన్నా అద్భుతమైన సక్సెస్‌ ఫుల్‌ సినిమా అంటూ ఫుల్ గా ప్రమోట్ చేయాలనీ దిల్ రాజు ఇప్పటికే తన టీం ను సిద్ధం చేశాడు. ఇంతకీ ఈ ‘‘రౌడీ బాయ్స్‌’ హిట్ అవుతుందో లేదో చూడాలి

Also Read: యాక్షన్ .. రోమాంటిక్ గా కట్ అయిన ‘రౌడ్ బాయ్స్’ ట్రైలర్..!

Tags