Dil Raju On Shaakuntalam: భారీ బడ్జెట్ తో తెరకెక్కిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ ఫ్లాప్స్ గా మిగలడం మనం చూస్తూనే ఉన్నాము, కానీ ఆ సినిమాలు కనీసం మొదటి వీకెండ్ వరకు అయినా నిలబడి కనీస స్థాయి వసూళ్లు అయినా రాబట్టేవి. కానీ కొన్ని సినిమాలు పెట్టి బడ్జెట్ లో రెండు శాతం కూడా రికవరీ కానివి ఉన్నాయి, అలాంటి చిత్రాలలో ఒకటి ‘శాకుంతలం’
సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఇటీవలే విడుదలై ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ చిత్రాన్ని నిర్మించడానికి దాదాపుగా 60 కోట్ల రూపాయిల బడ్జెట్ అయ్యింది. సమంత కి అంత మార్కెట్ లేకపోవడం తో కేవలం 17 కోట్ల రూపాయలకే ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. మొదటి రోజు మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ రావడం తో ఈ సినిమాకి ఫుల్ రన్ లో కేవలం 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి.
ఇక రీసెంట్ గానే ఈ చిత్రానికి ఒక నిర్మాతగా వ్యవహరించిన దిల్ రాజు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతూ ‘నా పాతికేళ్లలో ఎన్నో సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశాను, ఎన్నో సినిమాలను నిర్మించాను, అన్నీ హిట్స్ లేవు, కొన్ని ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. కానీ శాకుంతలం లాంటి ఫ్లాప్ ని నా జీవితం లో ఎప్పుడూ చూడలేదు, పెట్టిన డబ్బులో రెండు శాతం కూడా రికవరీ అవ్వలేదు’అని చెప్పుకొచ్చాడు.
మరో పక్క డైరెక్టర్ గుణశేఖర్ కూడా ఈ చిత్రానికి సహా నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే, ఆయన కొత్త ఈ చిత్రం వల్ల తాను ఇనాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బులు మొత్తం పోయాయట. అలా ఈ చిత్రం అందరికీ ఒక చేదు జ్ఞాపకం లాగ మిగిలిపోయింది. దిల్ రాజు కి ఈ కష్టనష్టాలు కొత్తేమి కాదు,ఈ సినిమాలో పోయిన డబ్బులు తర్వాతి సినిమాలతో రప్పించుకోగలడు. పాపం గుండశేఖర్ పరిస్థితే దారుణంగా తయారైంది. ఈ షాక్ నుండి ఆయన ఎప్పటికి కోలుకుంటాడో చూడాలి.