Varasudu- Kalyanam Kamaneeyam: దిల్ రాజు పరిశ్రమ ఒత్తిడికి తలొగ్గాడని తెలుస్తుంది. మొన్నటి వరకు నా థియేటర్స్ లో నా సినిమా ఆడించుకోవడం తప్పా? అని ప్రశ్నించారు. మేము ఎగ్జిబిటర్స్ దగ్గర లీజుకు తీసుకొని కోట్లు ఖర్చు చేసి థియేటర్స్ ఆధునీకరించాము. అలాంటప్పుడు ఫస్ట్ ప్రయారిటీ నా సినిమాకు ఇచ్చుకుంటే తప్పేంటి? అని దిల్ రాజు సమాధానం చెప్పారు. ఒక డబ్బింగ్ మూవీకి పెద్ద సంఖ్యలో థియేటర్స్ లాక్ చేసి చిరంజీవి, బాలకృష్ణ చిత్రాలకు అన్యాయం చేస్తున్నాడన్న ఆరోపణల నేపథ్యంలో దిల్ రాజు ఈ కామెంట్స్ చేశారు. వారసుడు చిత్ర విడుదల తేదీగా జనవరి 12 నిర్ణయించారు. కాదని అది జనవరి 11కి ప్రీఫోన్ చేశాడు. ఆయన చెప్పిన ప్రకారం 11న వారసుడు విడుదలైతే వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలకు తక్కువ సంఖ్యలో థియేటర్స్ లభిస్తాయి.

నా మాటే శాసనం అని భీష్మించుకుని కూర్చున్న దిల్ రాజుపై ఒత్తిడి తెచ్చారని తెలుస్తుంది. బ్రతిమిలాడో భయపెట్టో వారసుడు విడుదలను వెనక్కి నెట్టారు. చిరంజీవి, బాలయ్య చిత్రాల ఓపెనింగ్ డే వసూళ్లు దెబ్బతినకుండా ఉండాలి అంటే ఎక్కువ థియేటర్స్ లో విడుదల కావాలి. తమ చిత్రాల కంటే ముందు వారసుడు విడుదలైతే అది కుదదరు. ప్రస్తుతం అనుకుంటున్న థియేటర్స్ మాత్రమే లభిస్తాయి.
దిల్ రాజుని ఎవరు ఒప్పించారో తెలియదు కానీ… ఆయన వారసుడు 14వ తేదీకి షిఫ్ట్ చేసుకున్నాడు. దిల్ రాజు నిర్ణయం హీరో సంతోష్ శోభన్ సినిమాను ఎఫెక్ట్ చేసింది. ఆ రోజు కళ్యాణం కమనీయం మూవీ విడుదల కానుంది. 14న వారసుడు విడుదల ఉంటుంది కాబట్టి… కళ్యాణం కమనీయం జనవరి 15కి వాయిదా వేసుకోవాలని వారికి సూచించినట్లు సమాచారం. అయితే కళ్యాణం కమనీయం విడుదల తేదీలో ఎలాంటి మార్పు ఉండదని ఆ చిత్ర దర్శకుడు వెల్లడించారు. ప్రకటించినట్లే మా మూవీ విడుదల అవుతుంది. రిలీజ్ డేట్ మార్చడం లేదన్నారు

ఇది దిల్ రాజుకు పెద్ద షాక్ అని చెప్పొచ్చు. కళ్యాణం కమనీయం చిత్ర హీరో చిన్నవాడు అయినప్పటికీ నిర్మాణ సంస్థ పెద్దది. ప్రభాస్ హోమ్ బ్యానర్ యూవీ కాన్సెప్ట్స్ నిర్మించారు. దీంతో వారు తమ సినిమా విడుదల వెనక్కి జరిపేది లేదంటున్నారు. అయితే ఈ నిర్ణయం దిల్ రాజును పెద్దగా ఎఫక్ట్ చేయదు. వారసుడు చిత్రానికి దక్కాల్సిన థియేటర్స్ లో ఎలాంటి మార్పులు ఉండదు. ఇక 2023 సంక్రాంతి చిత్రాల విడుదల తేదీలు గమనిస్తే.. 11న తెగింపు, 12న వీరసింహారెడ్డి, 13న వాల్తేరు వీరయ్య, 14న వారసుడు, కళ్యాణం కమనీయం విడుదలవుతున్నాయి.