Dil Raju- Venu Tillu: జబర్దస్త్ కమెడియన్ పై దిల్ రాజు భారీగా పెట్టుబడి పెడుతున్నారట. ఆయన చెప్పిన కథకు ఫిదా అయిన ఈ స్టార్ ప్రొడ్యూసర్ మూవీ నిర్మించడానికి సిద్ధమయ్యారట. దిల్ రాజు విశ్వాసాన్ని పొందిన ఆ జబర్దస్త్ కమెడియన్ ఎవరో కాదు టిల్లు వేణు. నటుడిగా కెరీర్ మొదలు పెట్టిన వేణు జబర్దస్త్ కమెడియన్ గా మారారు. ఆ షో ప్రారంభంలోనే టీం లీడర్ గా ఎంట్రీ ఇచ్చాడు. జబర్దస్త్ బ్లాక్ బస్టర్ సక్సెస్ నేపథ్యంలో వేణు బాగా పాప్యులర్ అయ్యారు. ఇక ఆయన జబర్దస్త్ వీడి చాలా కాలం అవుతుంది. అడపాదడపా చిత్రాల్లో కామెడీ రోల్స్ చేస్తున్నారు.

అయితే మనోడిలో క్రియేటివిటీ, దర్శకత్వ ప్రతిభ కూడా ఉందట. ఓ జబర్దస్త్ కథ సిద్ధం చేసి దిల్ రాజు వద్దకు వెళ్ళాడట. తన కథ వినిపించి ఆయన్ని ఇంప్రెస్ చేశాడట. టిల్లు వేణు కథ నచ్చడంతో మూవీ నిర్మాణానికి పంచ జెండా ఊపాడట. మేకింగ్ కి ఏర్పాట్లు చేసుకోమని హామీ ఇచ్చాడట. తెలంగాణా నేపథ్యంలో సాగే ఈ కథ దిల్ రాజుకు చాలా ప్రత్యేకంగా తోచిందట. కథలు జడ్జ్ చేయడంలో దిల్ రాజు తర్వాతే ఎవరైనా. ఆయన తన బ్యానర్ లో పదుల సంఖ్యలో బ్లాక్ బస్టర్స్ తెరకెక్కించారు.
దిల్ రాజు కథ ఓకే చేశారంటే మూవీ సగం విజయం సాధించినట్లే అన్న నానుడి ఉంది. మరి దిల్ రాజును అంతగా మెప్పించిన ప్రత్యేకత టిల్లు వేణు కథలో ఏముందని పరిశ్రమ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. అదే సమయంలో ఈ జబర్దస్త్ వాళ్ళను నమ్మొచ్చా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వేణు మాదిరే కిరాక్ ఆర్పీ డైరెక్టర్ అవతారం ఎత్తాడు. తన గురువు నాగబాబు చేత గ్రాండ్ గా మూవీ లాంచ్ చేయించాడు. తీరా చూస్తే సినిమా లేదు పాడూ లేదు. మూవీ మొదలు కాకుండానే నిర్మాత చేత రూ.20 లక్షలు ఖర్చు చేయించి నిండా ముంచేశాడు.

ఈ క్రమంలో టిల్లు వేణుపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే అక్కడ ఉంది ఆషామాషీ నిర్మాత కాదు. పరిశ్రమను శాసిస్తున్న నైజాం కింగ్. దిల్ రాజు చాలా నిక్కచ్చిగా ఉంటారు. ఏమైనా తోక జాడిస్తే కట్ చేసిపారేస్తారు. ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుంటే టిల్లు వేణుకు మంచి భవిష్యత్ దొరుకుతుంది. కాగా దిల్ రాజు నిర్మాణంలో శంకర్-రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కతున్న ఆర్సీ- 15 తాత్కాలికంగా వాయిదా పడింది.
[…] […]
[…] […]