Dil Raju Comments On SVP: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన సర్కారు వారి పాట సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం సాధించిన సంగతి మన అందరికి తెలిసిందే..మొదటి రోజు మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా అటు వసూళ్ల పరంగా ఇటు సినిమా పరంగా అభిమానులకు మంచి తృప్తిని ఇచ్చింది..కానీ ఈ సినిమా ప్రొడ్యూసర్లు చూపిస్తున్న కలెక్షన్స్ పై మొదటి రోజు నుండి సోషల్ మీడియా లో విపరీతమైన నెగటివిటీ ఏర్పడిన సంగతి మన అందరికి తెలిసిందే..వచ్చిన కలెక్షన్స్ కంటే అధికంగా చెప్తున్నారు అని..అసలు ఇంత వసూళ్లు రాలేదని డైలీ కలెక్షన్ల ట్రాకింగ్ చేసే ట్రేడ్ వర్గాలు బహిరంగంగానే చెప్తూ వస్తున్నాయి..ఇక ఈ సినిమా నైజం ఏరియా హక్కులను దిల్ రాజు కొనుగోలు చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..భీమ్లా నాయక్, #RRR , అఖండ వంటి వరుస హిట్స్ తో నైజం ప్రాంతం లో డిస్ట్రిబ్యూటర్ గా లాభాలను మూటగట్టుకున్న దిల్ రాజు,సర్కారు వారి పాట సినిమా తో తన బాక్స్ ఆఫీస్ జైత్ర యాత్రని కొనసాగించాడు.

Also Read: CM Jagan- KTR: ఇక్కడ తిట్లు.. అక్కడ స్నేహం.. కేటీఆర్, జగన్ సర్ ప్రైజ్
ఇప్పుడు ఆయన నిర్మించిన F 3 చిత్రం ఈ నెల 29 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సందర్భంగా ప్రొమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్న దిల్ రాజు ఇటీవల ఒక్క ఇంటర్వ్యూ లో రీసెంట్ గా సోషల్ మీడియా లో జరుపుగుతున్న ఫేక్ కలెక్షన్స్ గురించి మాట్లాడుతూ ‘డిస్ట్రిబ్యూటర్ గా డైలీ కలెక్షన్స్ రిపోర్ట్ నిర్మాతకి ఇవ్వడం వరకే మా బాధ్యత..కలెక్షన్స్ వాళ్లకి ఇష్టమొచ్చింది చెప్పుకుంటారు..ఫేక్ కలెక్షన్స్ చెప్పుకోవడం వల్ల ఒక్క గంట ఆనందం తప్పితే ఎవ్వరికి ఒక్క రూపాయి లాభం కూడా ఉండదు..త్వరలోనే ఆంధ్ర ప్రదేశ్ అమెరికాలో ఉన్న రెంటార్క్ మాదిరి ఆన్లైన్ కలెక్షన్స్ ట్రాకింగ్ సిస్టం అందుబాటులోకి రాబోతుంది..కలెక్షన్ల విషయం లో పారదర్శకత కచ్చితంగా రాబొయ్యే రోజుల్లో వస్తుంది’ అని దిల్ రాజు ఈ సందర్భంగా మాట్లాడాడు..ఆయన సర్కారు వారి పాట సినిమాని నైజం ఏరియా లో 26 కోట్ల రూపాయలకు హక్కులను కొనుగోలు చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..ఇప్పటి వరుకు ఈ సినిమా ఇక్కడ 27 కోట్ల రూపాయిల షేర్ ని సాధించింది..బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలి అంటే ఈ సినిమా ఇక్కడ మరో 9 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చెయ్యాల్సి ఉంది.

Also Read: Natraj Master Allegations On Bindu: ఎవరైనా పుణ్యం కట్టుకొని ఈ నటరాజ్ మాస్టర్ ని డాక్టర్ కి చూపించండర్రా !
Recommended videos
[…] […]