కరోనా పరిస్థితుల్లో.. ఇండియాలో పెద్ద చిత్ర పరిశ్రమ అయిన బాలీవుడ్ కన్నా, తెలుగు ఇండస్ట్రీ ముందంజలో ఉందని దిల్ రాజు అన్నారు. థియేటర్లు తెరుచుకోవడానికి అనుమతులు వచ్చిన కానుండి టాలీవుడ్ లో వరుసగా చిత్రాలు విడులవుతూ వచ్చాయని, సక్సెస్ రేట్ కూడా బాగానే ఉందని అన్నారు. అయితే.. బాలీవుడ్ లో మాత్రం సినిమా విడుదల చేయడానికే భయపడే పరిస్థితి ఉందన్నారు.
తెలుగులో సినిమా విడుదల చేయడానికి నిర్మాతలు ధైర్యం చేస్తుండగా.. సినిమా చూడటానికి ప్రేక్షకులు కూడా ధైర్యం చేస్తున్నారని అన్నారు. ఇక, తెలుగు రాష్ట్రాల్లో 50 శాతం ఆక్యుపెన్సీ రాబోతోందనే ప్రచారంపైనా దిల్ రాజు స్పందించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవడం ప్రభుత్వాల బాధ్యత అని అన్నారు.
అయితే.. 50 శాతం నిబంధన విధించినప్పటికీ.. సినిమాలు విడుదల చేస్తేనే మంచిదని అన్నారు. సినిమాలు పూర్తిచేసి ఆపేయడం కన్నా.. రిలీజ్ చేస్తే కార్మికులతోపాటు అందరికీ ఉపయోగం ఉంటుందని అన్నారు. 50 శాతం ఆక్యపెన్సీతో సినిమాలు విడుదల చేయడానికి చాలా మంది నిర్మాతలు సిద్ధంగా ఉన్నారని కూడా దిల్ రాజు చెప్పారు.