Dil Raju: ఇండస్ట్రీ లో ఉన్న టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్స్ లో ఒకరు దిల్ రాజు..ఒక చిన్న డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ని ప్రారంభించి, ఆ తర్వాత నిర్మాతగా మారి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందించిన ఆయన ఇప్పుడు ఇతర బాషలలో కూడా సినిమాలు నిర్మిస్తున్నాడు..తెలుగు లో క్లాసిక్ గా నిలిచినా నాని జెర్సీ సినిమాని హిందీ లో షాహిద్ కపూర్ ని హీరో గా పెట్టి రీమేక్ చేసి చేతులు కాల్చుకున్న ఈయన..ఇప్పుడు తమిళ టాప్ స్టార్ విజయ్ తో ‘వరిసు’ అనే సినిమాని నిర్మిస్తున్నాడు.

తెలుగు దర్శకుడు వంశి పైడిపల్లి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇక్కడ ‘వారసుడు’ అనే పేరు తో విడుదల అవుతుంది..రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుండగా..థమన్ సంగీతం అందిస్తున్నాడు..ఇటీవలే ‘రంజితమే రంజితమే’ లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చెయ్యగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని తెలుగు మరియు తమిళం బాషలలో విడుదల చెయ్యబోతున్నాడు దిల్ రాజు.
అయితే అదే సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ మరియు నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన ‘వీరసింహారెడ్డి’ చిత్రాలు విడుదల అవుతున్నాయి..అయితే స్వతహాగా దిల్ రాజు కి నైజాం మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాలలో థియేటర్స్ భారీగానే ఉన్నాయి..ఇప్పుడు వారసుడు సినిమాకి తన థియేటర్స్ ని మాత్రమే కాకుండా..రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మంచి థియేటర్స్ అన్నిటిని బుక్ చేసేస్తున్నాడు..ఉదాహరణకి వైజాగ్ వంటి సిటీ లో 14 థియేటర్స్ ఉండగా వీటిల్లో 6 కి పైగా థియేటర్స్ ని ‘వారసుడు’ సినిమాకి బుక్ చేసేసుకున్నాడు దిల్ రాజు.

మిగిలిన థియేటర్స్ లో చిరంజీవి మరియు బాలయ్య బాబు సినిమాలు విడుదల కానున్నాయి..ప్రతి చోట ఇదే పరిస్థితి ఏర్పడనున్నాయి..తెలుగు లో అంత పెద్ద మాస్ హీరోల సినిమాలు విడుదల అవుతున్న సమయం లో ఇలా ఒక తమిళ సినిమాకి థియేటర్స్ అన్నిటిని బ్లాక్ చేసి తెలుగు సినిమాకి అన్యాయం చెయ్యడం ఏమిటి అని ఆడియన్స్ దిల్ రాజు పై విరుచుకుపడుతున్నారు..ప్రొడ్యూసర్స్ గిల్డ్ కి అధినేత గా వ్యవహరిస్తున్న దిల్ రాజు ఇలాంటి పనులు చెయ్యడం ఏ మాత్రం సబబు అని వాపోతున్నారు ట్రేడ్ పండితులు.
తమిళం ఇలాగె వరిసు సినిమాకి పోటీగా అజిత్ ‘తూనీవు’ చిత్రం విడుదల అవుతుంది..అక్కడి అగ్ర హీరోల సినిమాలు ఒకేసారి విడుదల అవుతున్న నేపథ్యం లో చిరంజీవి , బాలయ్య సినిమాలకు అక్కడ ఒక్క థియేటర్ కూడా దక్కే అవకాశం కనిపించాడు..తమిళ సినిమాలకు వాళ్ళు అంత ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు..మనం ఎందుకు మన తెలుగు సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వకూడదు ? అంటూ దిల్ రాజు పై ప్రశ్నల వర్షం కురుస్తుంది..దీనికి ఆయన ఎలాంటి వివరణ ఇస్తాడో చూడాలి.